పుట:Loochupu-fr.Jojayya.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. జీవితాశయూలు

1. ఆశయాల విలువ చాలమంది జనులు చేయవలసినంత కృషి చేయరు. సాధించవలసి నన్ని విజయాలు సాధించరు. దీనికి కారణం జీవితంలో ఆశయాలు అంటూ లేకపోవడమే. ఆశయాలు లేనివాళ్లు జీవచ్ఛవాలలాగ జీవిస్తుంటారు. బ్రతుకు భారమనిపిస్తుంది. కాని ఆశయాలను కలిగించుకొనేవాళ్లకు జీవితం ఉత్సాహవంతంగా వుంటుంది. బ్రతకాలనిపిస్తుంది. క్రొత్త త్రోవలు కనిపిస్తాయి. నెహ్రూ, గాంధీ, కెన్నడీ మొదలైన మహాపురుషులంతా ఆశయాలు కలవాళ్లే జీవితంలో ఒక్క ఆశయమంటూ చాలదు. మనమున్న పరిస్థితులనుబట్టి ఎప్పటికప్పుడు క్రొత్త ఆశయాలను కలిగించుకోవాలి. పరిస్థితులు అనుకూలించందే కేవలం ఆశయాలవల్లనే కార్యాలు సిద్ధించవు. ఐనా పురుషుకారమంటూ ఒకటుంది. కనుక మన ఆశయాలు మనకుండాలి. వాటిని సాధించేందుకు కృషి చేయాలి. జీవితంలో కొన్ని ఆశయాలు గలిగించుకోవాలంటే ఏమో అక్కరలేదు - ఆత్మజ్ఞానమూ, ವಿಟ್ಟು దలా, ఉత్సాహమూ - ఈ మూడూ వుంటే చాలు.

2. ఆశయాలు కలిగించుకోవడం ఏలా?

ఆశయాలను కలిగించుకొనేప్పడు కొన్ని నియమాలను పాటించాలి. వాటిని క్రింద పొందుపరుస్తున్నాం. ఆశయాలు లేనివాళ్లు ఒట్టినే ఏదో పని చేస్తూంటారు. కాని ఆశయాలు కలవాళ్లు ఏదో సాధించాలని ఆయా పనులు చేస్తూంటారు. ఇది చాల పెద్ద భేదం. అసలు ఓ ఆశయాన్ని కలిగించుకోవడంతోనే కొంత కార్యం సాధించినవాళ్ల మౌతాం. 1. ఆశయాలను కలిగించుకొనేముందు మనలను మనం నిశితంగా పరీక్షించి చూచుకోవాలి. మనందరికీ కొన్ని విషయాల్లో నేర్పూ, చాకచక్యమూ వుంటుంది. వీటిని మన శక్తి సామర్థ్యాలు అందాం. మరికొన్ని అంశాల్లో మనకు నైపుణ్యం ఉండదు. వీటిని చేపడితే తప్పకుండా అపజయం పొందుతాం. వీటిని మన కొరతలు అందాం. ఇక, ఓ ఆశయాన్ని ఎన్నుకొనేపుడు దాన్ని మన కొరతలకు చెందిన రంగం నుండి గాక, శక్తి సామర్థ్యాలకు సంబంధించిన రంగంనుండి ఎన్నుకోవాలి. లేకపోతే