పుట:Loochupu-fr.Jojayya.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాళ్లకు హాని చేద్దామనిగానీ వస్తునష్టం కలిగిద్దామని కానీ నిర్ణయానికి రాకూడదు. ఈ భావాలు విజృంభించి వున్నపుడు మన ఆలోచన సరిగా పనిచేయదు. యుక్తాయుక్తాలు గ్రహించలేం. కనుక ఈ సమయంలో చేసికొనే నిర్ణయాలు తగినవి కావు. 6. మనోభావాలు విజృంభించినపుడు ఓ కార్యం చేయడం కంటె మానుకోవడం మేలు. ఆ భావాలు ఉపశమించాక ఆ కార్యాన్ని నిమ్మళంగా చేసికోవచ్చు. ఉదాహరణకు నా కెవరిమీదనో విపరీతమైన కోపం వచ్చింది. కోపతాపాలను వెళ్లగ్రక్కుతూ వాళ్లకు వెంటనే జాబు వ్రాద్దామనుకొన్నాను. కాని కొంచెం పస్తాయించుకొని ఆనాడు జాబు వ్రాయలేదు. మరునాడు కోపం తగ్గిపోయాక కమ్మ పంపాను. ఆ జాబు అంత నిష్టురంగా ඒකීය. కోపం రాగానే లేఖ వ్రాసినట్లయితే అది చదివే వాళ్లకు అసభ్యంగా వుండేదే. 7. మనోభావాలను పూర్తిగా అణచివేసికోగూడదన్నాం. ෂඩ් චීෆයී జీవితంలో కళ ఉండదన్నాం. కనుక ఓవైపు ఈ భావాలకు దాసులై పోకుండా, మరోవైపు వీటిని పూర్తిగా అణచివేయకుండా, ఈ భావాలను ప్రదర్శించ వలసినంతగా ప్రదర్శించేవాడు ఘనుడు. జీవితంలో విజయం సాధించేది ఈలాంటివాళ్లే. ఈ వ్యాసంలో మనోభావాలంటే ఏమిటో వాటి ప్రాముఖ్యమేమిటో తెలియజెప్పాం. వీటి నేలా అదుపులో పెట్టుకోవాలో సూచించాం. ఈ భావాల వలన మన జీవితమూ, వ్యక్తిత్వమూ క్షణక్షణమూ ప్రభావిత మౌతూనే వుంటుంది. కనుక విద్యార్థులు ఈ భావాలు తమ జీవితంలో ఎలా ప్రతిబింబిస్తున్నాయో చిన్ననాటి నుండే గుర్తిస్తూండాలి. వీటిని పెంపొందించుకోవలసినంతగా పెంపొందించుకొని అరికట్టుకో వలసి నంతగా అరికట్టు కొంటూండాలి.