పుట:Loochupu-fr.Jojayya.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వుండదన్నాం. ఈ భావాలన్నిటిలోను ప్రధానమైనవి ప్రేమా, దీనికి వ్యతిరేకమైన ద్వేషమూను. ప్రేమవలన ఇష్టమూ ద్వేషం వలన అనిష్టమూ పుడతాయి. ఈ రెండు భావాలూ మన హృదయంలో నీటిబుగ్గల్లాగ నిరంతరమూ పెల్లుబుకుతూనే వుంటాయి. హితకరమైనవే గానీయండి. హానికరమైనవే కానీయండి - మిగిలిన మనోభావాలన్నీ ఈ రెండింటితో పెనవేసికొనే వుంటాయి. అసలు ఈ జీవితమంతా రేయింబవళ్లతో లాగ ఈ ప్రేమ ద్వేషాలనే రెండు భావాలతో కొనసాగిపోతూంటుంది. కనుక ఈ రెండింటినీ వశంలోకి తెచ్చుకొన్నవాడు ఉత్తమ జీవితం గడుపుతాడు.

2. మనోభావాలు మగవాళ్లలో కంటె గూడ ఆడవాళ్లలో తీవ్రంగా పనిచేస్తాయి. అందుకే "క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్" అన్నాడు ఓ ప్రాచీనకవి. ఈ సత్యాన్ని గుర్తించండే స్త్రీని ఆమె ప్రవర్తననీ అర్థం చేసికోలేం.

3. కొంతమంది మనోభావాలకు దాసులై పోతుంటారు. అవి ఆడించి నట్టల్లా ఆడుతూంటారు. కాని మనలోని రాగద్వేషాలకు వశులమైపోవడం వల్లకాదు, వాటిని జయించడం వల్ల చిత్తశాంతి లభిస్తుంది. ఉదాహరణకు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది వ్యసనాలన్నీ మనోభావాలే. వాటికి లొంగిపోవడం వల్ల తాత్కాలికానందం కలిగినా మనశ్శాంతేమో లభించదు. వాటిని జయించినవాడు పూర్ణకాముడూ కోరికలు తీరినవాడూ ఔతాడు.

4. మనోభావాలను అదుపులో పెట్టుకోవడానికి అలవాటు పడినవాళ్లు దూరదృష్టితో ప్రవర్తిస్తారు. నిదానంగా ఆలోచించి పనిచేస్తారు. రాగద్వేషాలు వాళ్ల హృదయంచుట మబ్బుల్లాగ ఆవరించవు. వాళ్ల ఆలోచన మందగిం చేలా చేయవు. అలాంటివాళు మానసికమైన ఆరోగ్యాన్ని కూడ అనుభవిస్తారు.

5. మనోభావాలు ఉధృతంగా విజృంభించి ఉన్నపుడు మనం క్రొత్త నిర్ణయాలను చేసికోగూడదు. పూర్వం చేసిన మంచి నిర్ణయాలను మార్చుకోనూ గూడదు. ఉదాహరణకు, ఇతరులమీద కోపం వచ్చినపుడు