పుట:Loochupu-fr.Jojayya.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పనిచేసే ఓ గొప్ప శక్తి అన్యాయం జరిగినప్పడు ఈ కోపాన్ని ప్రదర్శించాలి. సామర్థ్యంతో దౌర్జన్యాన్ని అరికట్టాలి. కాని వట్టినే చీటికి మాటికి కోపపడు తుంటే తోడి ప్రజలకు నచ్చదు. కనుక కోపాన్ని అసలు ప్రదర్శించకుండా వున్నా లాభంలేదు. ప్రదర్శించగూడనపుడు ప్రదర్శించినా లాభంలేదు. అనగా దాన్ని అదుపులో వుంచుకోవాలి. అవసర మొచ్చినపుడు వలసినంతగా ప్రదర్శించాలి. దీన్నే సంయమనం అంటాం.

కొన్ని మనోభావాలను పెంపొందించుకొంటూండాలి. కాని కొన్నిటిని పూర్తిగా చెప్పచేతల్లో వుంచుకోవాలి. ఉదాహరణకు ప్రేమ, సంతోషం సానుభూతి, ధైర్యం, కోరిక - ఈలాంటి హితకరమైన భావాలను పెంపొం దించుకోవాలి. కాని ద్వేషం, పగ, అసూయ, నిరుత్సాహం, కామంఈలాంటి హానికరమైన భావాలను పూర్తిగా అదుడులో పెట్టుకోవాలి. కొన్ని మనోభావాలను మోతాదుకు మించివాడుకొంటే హాని చేస్తాయి. కోపం ఉత్సాహం ఈలాంటివే. కనుకనే ఈ భావాల విషయంలో సంయమనం అవసరమని చెప్పాం. ఏది ఏమైనా, మనోభావాలను అణచివేసే ప్రయత్నం మాత్రం చేయకూడదు. కొందరు సాధకులు ఈ భావాలు వస్తుతః చెడ్డవనీ వీటిని అణచివేయందే సిద్ధి కలుగదనీ బోధించారు. ఇది పొరపాటు. ఇవి లేకపోతే జీవితంలో పసవుండదు. ఉత్సాహం ఉండదు. కొయ్యబారిపోతాం, నడపీనుగులా తయారౌతాం. బ్రతుకు భారమౌతుంది.

కాని, భావసంయమన మనేది అంత సులభంగా సిద్ధించడు. అసూయ, కోపం, ద్వేషం, కామం, విచారం మొదలైన భావాలను అదుపులోకి తెచ్చుకోవాలంటే ఎంతో ప్రయత్నం చేయాలి. ఎంతో కాలం పడుతుంది గూడ. మనం ఇతరులను జయించవచ్చుగాని, మనలను మనం జయించు కోలేం. మహానుభావులూ ఋషితుల్యులూగాని అంతర్వర్గాన్ని అదుపులోకి తెచ్చుకోలేరు. ఆత్మవిజయం సాధించలేరు. ఐనా ఈ మనోభావాలను అదుపులోకి తెచ్చుకోందే నరునికి ఆత్మశాంతి అంటూలేదు.

5. పర్యవసానాలు

1. మనోభావాలు నిండుగా పనిచేసే వాళ్లకేగాని గొప్ప వ్యక్తిత్వం