పుట:Loochupu-fr.Jojayya.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయాన్ని సాధించలేం. ఉదాహరణకు యశోధనూ, ప్రతాపు ఇద్దరూ అన్నదమ్ములు. యశోధనుకు విజ్ఞానమూ పరిశోధనమూ అంటే యిష్టం. ప్రతాపుకు లలితకళలు, విశేషంగా చిత్రలేఖనం అంటే యిష్టం. కనుక యశోధను విజ్ఞానార్జననూ, ప్రతాపు లలితకళా సాధననూ ఆశయాలుగా తీసికోవాలి. వాళ్లిద్దరూ ఈ రెండు రంగాలనూ పరస్పరం మార్చుకొన్నట్లయితే తప్పక అపజయం పొందుతారు. ఆశయాలను కలిగించుకోవడానికి ఆత్మజ్ఞానం వుండాలి అనడంలో అర్ధం యిదే. 2. ఆశయాలను చేపట్టేపుడు మూడు ప్రధానాంశాలను గుర్తించాలి. మొదటిది మనం చేకొనే ఆశయం మన శక్తికి తగినట్లుగా వుండాలి. అది మన తాహతుకు మించిపోకూడదు. కనుక ఈ ఆశయాన్ని పెట్టుకొంటే నేను దీన్ని సాధించగలనా అనే ప్రశ్న వేసికోవాలి. రెండవది, ఆశయాలకు ఓ పరిధి లేక మానం (Measurability) అంటూ వుండాలి. అంటే ബ് యాశయాన్ని యింతమేరకు సాధిస్తానని నిర్ణయించుకోవాలి. গু3rাত చదువుల్లో పలానా పరీక్షకు కడతాననిగానీ, ఏదో వస్తువును పలానా పరిధి వరకు సంపాదిస్తాననిగానీ నిర్ణయించుకోవాలి. మనం సాధించిన విజయాన్ని ఏదో రూపంలో కొలిచి చూచుకోగలిగి వుండాలి. ఈ కొలత పెట్టనట్లయితే మన ఆశయం అనిశ్చితంగా వుండిపోతుంది. మూడవది, ఆశయానికి ఓ కాలనియమమంటూ వుండాలి. పలానా సంవత్సరానికో, పలానా మాసానికో, పలానా తేదీకో ఈ కార్యాన్ని సాధిస్తాను అని నిశ్చయించుకోవాలి. ఈ కాలనియమం లేకపోతే వట్టినే రోజులు జరిగి పోతూంటాయే గాని పని మాత్రం ప్రారంభంకాదు. అసలే నరులు బద్దకపురాయళ్లు గదా! ఈలా శక్తికి తగినట్లుగా వుండడం, ఓ పరిధిలో వుండడం, ఓ గడువు పెట్టుకోవడం అనే మూడు లక్షణాలు ఏ యాశయాలకు వుంటాయో వాటిని సాధించి తీరుతాం.

ఓ ఉదాహరణం చూద్దాం. వేణు హిందీ నేర్చుకోవాలి అనుకున్నాడు. కొద్దిగా నేర్చుకొన్నాడు అంతే. ఇక ముందుకు వెళ్లలేదు. జానకి కూడ హిందీ నేర్చుకోవాలి అనుకుంది. ఆ యమ్మాయి 2010 ఏప్రిలులో హిందీ ప్రవేశ పరీక్ష వ్రాయదల్చుకుంది. క్తస్తుక్ర ఆ పరీక్ష కవసరమైన గ్రంథాలు