పుట:Loochupu-fr.Jojayya.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హృదయంలో హఠాత్తుగా ఏదో క్రొత్త భావం పుడుతుంది. పై యుదాహరణల్లోని భయమూ, అసూయా ఈలాంటి క్రొత్తభావాలు. 2. ఈ నూత్నభావం వలన మన దేహంలో మార్పులు కలుగుతాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలూ గుండె ఎక్కువగానైనా పనిచేస్తాయి. మందగించనైనా మందగిస్తాయి. దేహంలో గ్రంథులు కూడ కొన్ని రసాలను ఊరిస్తాయి. మన ముఖభంగిమలూ, కాలు సేతుల కదలికలూ మారిపోతాయి. 3. హృదయంలోని నూత్నభావాలవల్లా దేహంలోని మార్పులవల్లా మన మేడో క్రొత్తపనికి పూనుకొంటాం. భయము మొదలైన మనోభావాలు కలిగినప్పడు ఆ భయానికి కారణమైన వస్తువునుండి దూరంగా పరుగెత్తుతాం. శ్యాము ఎదునుండి దూరంగా పరిగెతాడన్నాం. అలాగే సంతోషం మొదలైన మనోభావాలు కలిగినప్పడు ఆ భావాలకు కారణమైన వస్తువు దగ్గరకు వెళ్తాం. బిడ్డ తల్లి దగ్గరకు పరుగెత్తుకొని వస్తుంది. స్నేహితుడు స్నేహితుని దగ్గరకు వెళ్తాడు.

2. మనోభావాలు ఏవేవి? 

మనోభావాలు చాలా వున్నాయి. వీటిల్లో కొన్ని మనకు హితకరమైనవి. ప్రేమ మొదలైనవి ఈలాంటివి. వీటిని మనం ఆశిస్తాం, కోరుకొంటాం. ఈ భావాలను కలిగించే వస్తువుల వద్దకు వెళ్తాం. మరికొన్ని మనోభావాలు మనకు హానికరమైనవి. భయము మొదలైనవి ఈలాంటివి. వీటిని మనం పరిత్యజిస్తాం. ఈ భావాలను కలిగించే వస్తువు నుండి దూరంగా వైదొలుగుతాం. మనోభావాలన్నిటినీ హితకరములు, హానికరములు అని రెండు వర్గాలుగా విభజించవచ్చు.

1. ప్రేమ హితకరమైన మనోభావం. దానినుండే మెప్పకోలు గౌరవం, సానుభూతి, మేలు కోరడం మొదలైన భావాలు పుడతాయి. ఈ ప్రేమకు వ్యతిరేకమూ, హానికరమూ ఐన మనోభావం ద్వేషం. దీనినుండే అసహ్యమూ, చిన్నచూపు, అవజ్ఞా మొదలైన భావాలు కలుగుతాయి.

2. ఇష్టము నుండి కోరికా, కుతూహలమూ అనే భావాలు పుడతాయి. దీనికి వ్యతిరేకయిన అనిష్టం నుండి అవమానమూ, సిగ్గు, నిరాకరణమూ మొదలైన భావాలు జనిస్తాయి. 3. సంతోషం నుండి ఆనందమూ,