పుట:Loochupu-fr.Jojayya.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సద్వినియోగం చేసుకోవాలి. సభల్లో సమావేశాల్లో పోటీల్లో పాల్గొనాలి. హాస్టల్లోని విద్యార్థులందరితోను కలిసిమెలిసి తిరగడం నేర్చుకోవాలి నాటకాలూ అలంకరణలూ మొదలైనవాటిల్లో పాల్గొనాలి. ఈలా చేస్తే హైన్యభావాలు వాటంతటవే సమసిపోతాయి. ఈ వ్యాసంలో హైన్యభావాలు అంటే యేమిటో, అవి యేలా పుడతాయో, వాటిని ఏలా జయించాలో విచారించి చూచాం. వీటిని అరికట్టందే గొప్ప వ్యక్తిత్వమంటూ లేదు. ఈ భావాలను అదుపులోనికి తెచ్చుకోని నరుడు తనకు తాను ఉపయోగపడడు. ఇతరులకు అసలే ఉపయోగపడడు. కనుక విద్యార్థులు ఈ అంశాన్ని జాగ్రత్తగా ఆలోచించి చూడాలి.

10. మనోభావాలూసంయమనమూ 1. మనోభావాలు అంటే ఏమిటి?

మనందరిలో కొన్నిమనోభావాలు (Emotions) పని చేస్తుంటాయి. వీటినే మన పూర్వులు, రసాలూ, కోపతాపాలూ, రాగద్వేషాలూ, అంతర్వర్గాలూ అని ఉద్వేగాలు అని రకరకాల పేర్లతో పిల్చారు. కొందరు వీటిని ఉద్రేక భావాలు అని కూడ పిలుస్తారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. శ్యాము అలా వెళూండగా యింటి మొగసాల నుండి గబాలున ఓ యెద్దు అతన్ని పొడవడానికి వచ్చింది. అతడు భయంతో దానికి దొరకకుండా పరుగెత్తాడు. మరోదినం శ్యాము వీధివెంట వెళూండగా ఓ కుష్టరోగి అడుగుకోవడానికి వచ్చాడు. అతన్ని చూసేప్పటికల్లా శ్యాముకి జాలి వేసింది. ఇంకొక దినం అతడు క్లాసులో తనకంటె ఎక్కువ మార్కులు సంపాదించుకున్న మరో విద్యార్థిని చూచి కొరకొరలాడాడు. ఇక్కడ శ్యాము ఎద్దును చూచి భయపడ్డాడు. కుష్ట రోగికి సానుభూతి చూపాడు. తోడి విద్యార్థిని చూచి అసూయ చెందాడు. ఈ భయమూ సానుభూతీ, అసూయా అనేవే మనోభావాలు. ఈలాంటి భావాలు ఎన్నో మన హృదయంలో పట్టల్లో చీమల్లాగ కదలియాడు తుంటాయి.

సామాన్యంగా మనోభావాల్లో మూడు లక్షణాలు కన్పిస్తాయి. 1. మన