పుట:Loochupu-fr.Jojayya.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. హైన్య భావాలతో బాధపడే నరుడు తన్ను తాను అర్థం చేసుకోవాలి. ఇది మధ్యలో వచ్చిన గుణం. ఎవ్వరూ పుట్టుకతోనే హైన్య భావాలతో పుట్టరు. జీవితంలో విషమ పరిస్థితులవల్ల ఈ భావాలు కలుగుతాయి. ఈలా మధ్యలో వచ్చినభావాలను మధ్యలోనే జయించవచ్చు. కనుక న్యూనతాభావాలను అరికట్టవచ్చు. ఈలా ఆలోచించుకొని ఆత్మ విశ్వాసం పెంపొందించుకోవాలి.

3. ఇతరుల జీవితచరిత్రలను సమీక్షించడం గూడా ఓ పద్ధతి. డెమోస్తనీసు నత్తివాడు. రూస్వెలు పోలియోవల్ల వికలాంగుడయ్యాడు. హెలెన్ కెల్లర్ గ్రుడ్డిగా మూగగా పుట్టింది. నెపోలియన్ పొట్టివాడు. బితోవెన్ చెవిటి వాడు, బైరను కుంటి వాడు. అంబేద్కరు నిమ్నజాతిలో, లాలుబహుదూరుశాస్త్రి పేద కుటుంబంలో జన్మించారు. ఐనా వీళ్లంతా హైన్యభావాలకు గురికాలేదుగదా, వాటిని జయించి ప్రముఖ వ్యక్తులు కాగలిగారు. మనం మాత్రం ఈలా కాలేమా? ఈలాంటిదే బహిర్ముఖత్వం అలవరచుకోవడం గూడ. వేరేవాళ్లతో కలసిమెలసి తిరుగుతుంటే మన బాధలను విస్మరిస్తాం. ఇతరుల స్థితిగతులనూ అభిప్రాయాలను తెలిసికొని మనగొడవలను కాస్త విస్మరిస్తాం. అలా కాకుండా పొద్దస్తమానమూ మనలను గూర్చి మనం తలపోసికొంటూ కూర్చుంటే లేనిపోని బాధలను S°Ä) తెచ్చుకోవడమతుంది.

4. కొంత హాస్యప్రియత్వం కూడ అవసరం. హాస్యప్రియుడు ఉల్లాసంగా వుంటాడు. నరుడు తన్ను జూచి తానే నవ్వడం నేర్చుకోవాలి. తన అవకతవకలకు తానే నవ్వు తెచ్చుకోవాలి. అపుడు విచారం కొంత తగ్గిపోతుంది. పైగా ఈ విశాల ప్రపచంలో మన పాత్ర చాలా చిన్నది అని గుర్తించాలి. మన కొద్దిపాటి లోపాలవల్లా అల్పబాధలవల్లా కొంప ఏమీ మునిగిపోడు. ఇవ్వాళ్లమనం అపజయం పొందామే అని బాధపడతాంగాని, రేపు దాన్నెవడు గుర్తుంచుకొంటాడు? ఇంకా మునిమాణిక్యం, మొక్కపాటి, భమిడిపాటివంటి హాస్యరచయితల గ్రంథాలను కూడ చదువవచ్చు.

5. విద్యర్ధులైన వాళ్లు ప్రస్తుతం విద్యాసంస్థల్లో లభించే అవకాశాలను