పుట:Loochupu-fr.Jojayya.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిత్యమూ గమనిస్తూంటారు. వాళ్లతో పోల్చిచూచికొని వాళ్లలాగ లేమే అని తలపోసికొంటూ తమకు తామే హీనతాభావాలు కలిగించుకొంటారు. ఇంకా, మన దేశంలో కులవ్యవస్థ ఉంది. అగ్రకులాలకు ఉన్నన్ని సదుపాయాలు నిమ్న కులాలకు లేవు. అందుచేత క్రింది కులాలవాళ్లు పై కులాలతో పోల్చిచూచుకొని న్యూనతా భావాలు కలిగించుకొంటారు. ఓ ఆ స్థానంలో అగ్రకులాలకు చెందిన కవులు కులాన్ని కారణంగా బెట్టుకొని జాషువా కవిని హేళనం చేశారట. ఈ సంఘటనకు తన మనస్సు చాలా నొచ్చు కుందని చెప్పకొన్నాడు ఆ కవి.

4. ఇక వ్యక్తిగతంగా కూడా కొంతమంది హీనతాభావాలు అలవర్చు కొంటూంటారు కొందరికి ముఖం వికృతంగా వుంటుంది. లేదా ఏడో అంగవైకల్యం కలుగుతుంది. దీనివల్ల వాళ్లు ఎంతో బాధపడి పోతూంటారు. కొందరు అపజయాలూ అవమానాలూ పొంది పదిమందిలో నగుబాటు తెచ్చుకున్నాం గదా అని కుమిలిపోతారు. ఇంకా కొందరిలో స్వభావసిద్ధమైన భయమూ పిరికితనమూ వుంటాయి. ఈలాంటి కారణాలవల్ల జనులు తమకు తామే హీనతాభావాలు తెచ్చిపెట్టుకొంటూంటారు.

4. నివారణ మార్గాలు


హైన్యభావాలు ఓ పెద్ద వ్యాధిలాంటివి. ఇవి సోకినవాళ్లు అవకాశాలు వున్నా వృద్ధిలోకి రాలేరు. కనుక విజయసిద్ధిని కాంక్షించేవాళ్లు ఈ యనిష్ట భావాలను తప్పక తొలగించుకోవాలి. ఇందుకు కొన్ని మార్గాలున్నాయి. 1. హైన్యభావాలను జయించే ప్రధాన మార్గం ఆత్మాంగీకారం తోటలోని పూవుకీ పూవుకీ, ఆకాశంలోని చుక్కకీ చుక్కకీ వ్యత్యాసం ఉంటుంది. అలాగే నరునికీ నరునికీ వ్యత్యాసం వుంటుంది. కనుక ఇరుగు పొరుగువాళ్లతో పోల్చి చూచుకొని వాళ్లకిది అబ్బింది, నాకు అబ్బలేదు అని బాధపడితే లాభంలేదు. మనకున్న వాటితో మనం సంతృప్తి చెండాలి. విశేషంగా మన లోపాలనూ మేలిగుణాలనూ ఉన్నవాటిని ఉన్నట్లుగా అంగీకరించడం నేర్చుకోవాలి. ఆ లోపాలను సవరించుకొనే ప్రయత్నం చేయాలి. మేలి గుణాలను రోజరోజుకీ ఇంకా వృద్ధిచేసుకొంటూండాలి. ఈలా చేస్తే నరుడు చక్కని మనశ్శాంతిని అనుభవిస్తాడు. మరి ఆత్మ సంతృప్తి లేనివాళ్లు మనోవ్యాధికి గురై పోతారు.