పుట:Loochupu-fr.Jojayya.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిల్లలను వేరేవాళ్లతో పోల్చి చూపుతుంటారు. ప్రక్కింటి పిల్లవాడు చూచిరమ్మంటే కాల్చివస్తూంటాడని తమ పిల్లవాడికైతే అభమూ శుభమూ తెలీదని చెప్తుంటారు. ఇలాంటి మాటల వల్లా చేతల వల్లా తల్లిదండ్రులే పిల్లల్లో హైన్యభావాలు కలిగిస్తూంటారు. కాని తల్లిదండ్రులు తెలియక నైతేనేమి, చిన్నపిల్లల మనస్తత్వం అర్థం చేసుకోలేకపోవడం వల్లనైతేనేం ఈలా చేస్తుంటారు. ఏమైతేనేం కొందరు పిల్లలకు మాత్రం ఇంటిలోనే హీనతా భావాలు పట్టుబడతాయి.

2. కొందరికి బళ్లో చదువుకునేటప్పడు ఈ భావాలు కలుగుతాయి. కొంతమంది ఉపాధ్యాయులు ఏదురుద్దేశం పెట్టుకోకుండానే ఎవరో ఓ విద్యార్థిని క్లాసులో పదిమందిముందూ గేలి చేస్తారు. దాని వలన ఆ విద్యార్థి మనసు నొచ్చుకొని న్యూనతాభావాలు కలిగించుకోవచ్చు. ఓ బ్రిటీషు ఉపాధ్యాయుడు తన క్లాసులో ప్రతి కుర్రవాడూ ప్రధానమంత్రి కాగలిగేంతటి వాడు అనుకునేవాడట. కాని ఈలాంటి ఉపాధ్యాయులు చాలా అరుదు. మరీ కొంతమంది ఉపాధ్యాయులైతే విద్యార్థులను అసలు అభిమానంతో చూడనే చూడరు. ఇంకా కొందరు విద్యార్థులు సహజంగానే మొద్దురకాలు కావడం వల్ల బళ్లో ఆట్టే రాణించరు. అన్నిటిలోను వెనుక పడుతూంటారు. ఎప్పడు ఏమీ బహుమతులు సాధించలేరు. ఈలాంటివాళ్లు తెలివైన విద్యార్థులతో పోల్చిచూచుకొని న్యూనతా భావాలకు లొంగిపోవచ్చు. ఇంకా బళ్లల్లో కొందరు పెద్ద పిల్లలు చిన్న పిల్లలను బాధించి ఏడ్పిస్తూంటారు. దీనివల్ల కూడ ఆ పిల్లల్లో న్యూనతా భావాలు పుట్టవచ్చు. కొంతమంది పిల్లలు ఇంటివద్ద చాలా గారాబంగా పెరిగివస్తారు. కాని పొరుగూరి బడికి వచ్చాక అక్కడ వాళ్లను తాగితలచే వాళ్లు వుండరు. అలాంటప్పడు వాళ్లల్లో దిగులూ న్యూనతా భావాలు పుట్టుక వస్తాయి. ఈలా రకరకాల కారణాలవల్ల బళ్లో చదువుకొంటూండగానే కొందరు పిల్లలు హీనతాభావాలకు గురైపోతారు.

3. ఒకోమారు సమాజం కూడా హీనతాభావాలను కలిగిస్తుంది. ప్రజలు కొంతమంది ధనిక వర్గాలకూ కొంతమంది పేదవర్గాలకూ చెందిన వాళ్లు. ధనికులూ పేదలూ ఓ మెలిగేటప్పడు వీళ్లు వాళ్లను