పుట:Loochupu-fr.Jojayya.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధును పిరికిపంద అనీ, స్వార్థపరుడనీ తిట్టారు. వాళ్ల బృందం నుండి అతన్ని వెలివేశారు. ఐనా మధు ఏమీ జంకలేదు. అదే సహాధ్యాయులు ఇంకోనాడు మరోపథకం వేశారు. క్లాసులో వంతుల ప్రకారం దగ్గి తెలుగు మాస్టరుగారిని కంగారు పెట్టాలి అనుకున్నారు. కిరణ్కి వాళ్లలో చేరడానికి ఇష్టంలేదు. ఐనా ఆ పోకిరి రాయళ్లకు భయపడి లొంగిపోయాడు. తన వంతు వచ్చినపుడు నేర్పులేనిదగ్గు దగ్గాడు, పట్టుబడ్డాడు. మాస్టరుగారి రౌద్రానికి గురై క్లాసు నుండి బహిష్కృతుడయ్యాడు. మధు, కిరణ్ వీళ్లిద్దరి ప్రవర్తనలో వ్యత్యాసం ఏమిటి?

మధు స్వతంత్రంగా ప్రవర్తించాడు. కిరణ్ అలా ప్రవర్తించలేక పోయాడు. వత్తిడికి లొంగిపోయాడు. లోకంలో జనులు ఎవరికి వాళ్లు స్వతంత్రంగా ప్రవర్తించాలని కోరుకొంటారు. ఎవరి నిర్ణయాలు వాళ్లు చేసికోగోరుతుంటారు. ఇలాంటి స్వాతంత్ర్యాభిలాష లేనివాళ్లలో చైతన్యమూ వుండదు, కార్యోత్సాహమూ వుండదు. గొర్రెల మందల్లా వేరేవాళ్లని అనుకరిస్తారు. వ్యక్తిత్వాన్ని నాయకత్వాన్ని అలవరచుకోలేరు. కావున వృద్ధిలోనికి তে০ষ্ঠিত వ్యక్తి తీర్చుకోవలసిన మానసికావసరాల్లో స్వాతంత్ర్యాభిలాష కూడ ఒకటి. - Independence.

4. లలిత పోస్టు జవాను వద్దనుండి జాబు అందుకుంది. అది తన నాన్నకు. కాని దానిమీద తాను చదువుకునే స్కూలు ముద్ర వుంది. కనుక అది వాళ్ల హెడ్మిస్టస్ వద్దనుండి వచ్చివుండాలి. హెడ్మిస్టస్ తన్ను గూర్చి నాన్నకు ఏమి వ్రాసిందబ్బా అని విస్తుపోయింది లలిత. కొంచెం సేపయ్యాక నాన్నగారు లలితను పిలిచి జాబు చదివి విన్పించారు. "పోయినయేడు లలిత మంచి మార్కులు సంపాదించడం వల్ల ఈ యేడు స్కాలర్షిప్ లభించింది” అని వుంది హెడ్మిస్టస్ జాబులో నాన్న లలితను అభినందించాడు. ఆప్యాయంగా దగ్గరకు తీసికొని ముద్దు పెట్టుకున్నాడు. ఆ యమ్మాయి ఎంతో ఆనందిం చింది. తాను సాధించిన విజయాన్ని తలంచుకొని పొంగిపోయింది.

సుగుణ కూడ అదే స్కూల్లో చదువుకుంది. కాని తాను చదువు