పుట:Loochupu-fr.Jojayya.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యమూ అదే సెలవులకు యింటికి వచ్చాడు. కాని ఆ రోజే ఇంటి దగ్గర వాళ్లమ్మా నాన్న పోట్లాడుకుంటున్నారు. వాళ్లిద్దరిలో ఎవరూ అతని రాకడనుగూర్చి అంతగా పట్టించుకున్నట్లు ඒකී. ప్రొద్దు పోయినా వాళ్లింట్లో పొయ్యిమీదికి ఎసరెక్కలేదు. సత్యం చిన్నతమ్ముడు చీకటిలో గోడకానుకుని కునికిపాట్లు పడుతున్నాడు. గోడమీదినుండి విషాద పూరితంగా గూబ అరిచింది. సత్యానికి చాలా నిరుత్సాహం కలిగింది. అతడు స్కూల్లో పింగ్పోంగ్ పోటీలో గెలిచి ఓ చక్కని పెన్ను బహుమతి పొంది వచ్చాడు. ఇంటికి రాగానే ఆ పెన్ను అమ్మకూ, నాన్నకూ చూపించాలి అనుకున్నాడు. కాని వాళ్లు ఆ గొడవలో వుండడం వల్ల అతనికి పెన్ బయటికి తీయడానికి గూడ ಬುದ್ದಿ పుట్టిందికాదు. రవీ, సత్యమూ ఈ ఇద్దరు బాలకుల మానసిక భావాల్లో భేదం ఏమిటి?

రవికి తల్లిదండ్రుల అనురాగం లభించింది. సత్యానికి లభించలేదు. ఇతరుల అనురాగమూ ఆదరణా పొందినపుడు అందరమూ సంతోషిస్తాం. సూర్యరశ్మి సోకిన తామర పూవులా మన హృదయం వికసిస్తుంది. ఇతరులు మనలను ఆదరించి ప్రేమించినపుడు భద్రంగా సురక్షితంగా వున్నాం అన్పిస్తుంది. మనం కూడా ముఖ్యమైనవాళ్లం, లోకానికి మనతో ఎంతైనా అవసరం వుంది అనుకుంటాం. ఈలాంటి భావాలు మానసికాభివృద్ధికి అత్యసవరం. కనుక ఇతరుల ప్రేమను మనం తప్పకుండ అంగీకరిస్తుండాలి. తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఇలా చాలమంది మనలను అనురాగంతో చూస్తుంటారు. ఈ యనురాగాన్ని మనం కాదనగూడదు. మన మానసికావసరాలను తీర్చుకోవాలంటే ఇతరుల నుండి ఈ యనురాగాన్నీ భద్రతనూ అంగీకరిస్తుండాలి - Affection and Security.

3. రఘు, మధు, కిరణ్ మొదలయిన వాళ్లంతా సహాధ్యాయులు, కాలేజి విద్యార్ధులు. ఓ దినం రఘు ముఠా క్లాసు ఎగగొట్టి మాట్నీకి వెళ్లాలనుకుంది. క్లాసు అటెండెన్సు సమయంలో రఘు తరపున మధును "ప్రోక్సీ" పలుకమన్నారు. కాని మధు అందుకు అంగీకరింపలేదు. ముఠా 11