పుట:Loochupu-fr.Jojayya.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గెలిచింది. అది చూచి సుజాత గుబగుబ ఉడికిపోయింది. "నేను కలవారి బిడ్డను. ఐనా ఏమి లాభం? ఊరూపేరూలేని ఈ సుజాత గెలిచింది కదా? అనుకొని వ్యసనపడిపోయింది. తన చేత గాని తనాన్ని తానే నిందించుకుంది. ఓవారం దాకా సుజాత దోమ ముసిరిపోయిన జొన్నకంకిలాగ మాడుమొగం పెట్టుకొని తిరిగింది. ఆ యమ్మాయి హృదయంలోని సంతోషం కాస్త ఒట్టిపోయింది. సావిత్రి, సుజాత యీ యిద్దరు బాలికల మనస్తత్వాల్లో భేదం ఏమిటి?

సావిత్రి తన్నుతాను అంగీకరించుకుంది. సుజాత తన్ను తాను అంగీకరించుకోలేదు. ఆత్మాంగీకారం జీవితంలో ఓ పెద్ద సమస్య మనలను గూర్చి మనం తక్కువగాను భావించుకోగూడదు. ఎక్కువగాను భావించుకో గూడదు. ఉన్నవాళ్లం ఉన్నట్లుగా మనలను మనం అంగీకరించుకొంటే చాలు. మన లోపాలను ఒప్పకోవాలి. వాటిని సవరించుకొనే ప్రయత్నం చేయాలి. అలాగే మన మేలి గుణాలనూ అంగీకరించాలి. వాటిని అభివృద్ధి చేసుకొనే ప్రయత్నం చేయాలి. ఈలా చేసేవాళ్లు తమతో తాము హాయిగా సంతృప్తికరంగా జీవిస్తారు. ఈలా చేయనివాళ్లు మానసికంగా బాధపడతారు. అసలు తమకు తామే సంతృప్తి చెందలేరు. తమకు తామే ఓ సమస్యగా పరిణమిస్తారు. పైగా ఇతరుల వృద్ధిని చూచి అసూయపడతారు కూడ. తన్ను తాను అంగీకరించుకోకపోవడం అనే గుణం చాల ప్రమాదకర మైంది. అది క్రమేణ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సుకు కూడ దారితీస్తుంది. కనుక యువతీ యువకులు అత్యవసరంగా అలవర్చుకోవలసిన ຕົວES○ estroầ=ršo – Self-acceptance. Koś లోపాలతో పాటు, మేలి గుణాలతోపాటు, ఉన్నవాళ్లం వున్నట్లుగా మనలను మనం అంగీకరించు కుంటూండాలి.

2. రవీ, సత్యమూ హైస్కూలు విద్యార్థులు. రవి సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చాడు. అతడు ఊరు చేరుకొనేటప్పటికల్లా అమ్మా నాన్న స్టేషనుకు వచ్చారు. అమ్మ అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది. చిన్న చెల్లెలు ఊర్మిళ అతని కాళ్లకు పెనవేసుకుంది. రవి చాల సంతోషించాడు. వాళ్ల కుక్క కూడ తోక ఆడించుకుంటూ కుటుంబం వెంట నడిచిపోయింది.