పుట:Loochupu-fr.Jojayya.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముగించి పదేండ్లయింది. పెండ్లి చేసుకుని ముగ్గురు బిడ్డలనుకూడ కంది. ఓమారు పుట్టినింటికి వచ్చి చదువుకున్న స్కూలు కదా ఓ మారు చూచి వద్దామనుకొని పాఠశాలకు వచ్చింది. కాని స్కూల్లో ఆమెనెవరూ గుర్తుపట్టలేదు. ఎవరూ పలుకరించలేదు. తానెవరో ఇద్దరు ముగ్గురు టీచర్లకు జ్ఞాపకం చేసికుంది గాని వాళ్లామెను అట్టే పట్టించుకోలేదు. ఆమె స్కూల్లో ఉన్నప్పుడు ఏ విజాయాన్నీ సాధించలేదు. ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. కనుక అంతా ఆమెను మరచి పోయారు. సుగుణ కొంచెం సేపు బళ్లో అటూ యిటూ తిరిగి యింటిదారి పట్టింది. బళ్లో తనెవరూ గుర్తుపట్టలేకపోయారు కదా అని దారిపొడుగునా అనుకుంది. ఈ యిద్దరమ్మాయిల మానసిక భావాల్లో వ్యత్యాసం ఏమిటి?

లలిత విజయం సాధించింది కనుక సంతోషించింది. సుగుణ యే విజయమూ సాధించలేదు. కనుక సంతోషం పొందలేదు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. అప్పుడు గాని సంతృప్తి అంటూ ఉండదు. విజయసిద్ధి లేనివాళ్లను ఇతరులు కూడా గౌరవించరు. అనామకుల క్రింద లెక్కకడతారు. అలవాటు ప్రకారం అపజయం పొందుతూంటే మనకే నిరుత్సాహం కలుగుతుంది. ఏదో సాధిస్తూంటే గొప్పవాళ్ల మనిపిస్తుంది. జీవించాడానికి ఉత్సాహంగా వుంటుంది. కనుక విజయసిద్దీ కార్యసాధనమూ మన మానసికావసరాల్లో ఒకటి - Achievement and success.

ఈ వ్యాసంలో మానసికావసరాలను నాల్గింటిని పేర్కొన్నాం. అవి ఆత్మాంగీకారమూ, ఇతరుల అనురాగాన్ని పొందడమూ, స్వాతంత్ర్యాభి లాషా, విజయసిద్దీ. వీటిని సాధించిన వ్యక్తుల జీవితం కందెనబెట్టిన బండిలాగ నిబ్బరంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వీటిని సాధించని వాళ్ల జీవితంలో ఏదో కొరతా వెలితితనమూ గోచరిస్తుంది. కనుక విద్యార్థులు చిన్ననాటినుండే ఈ మానసికావసరాలను గుర్తించాలి. వీటిని తీర్చుకునే ప్రయత్నం చేస్తూండాలి. స్కూల్లో కాలేజీలో అవకాశాలు బోలెడన్ని లభిస్తాయి. GD