పుట:Lokokthimukthava021013mbp.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

188 అరవైయేండ్లయినవి చదువుకోక మన్నుగొట్టుకుంటాగా అన్నాడట

189 అరవై వరహాలిచ్చినా అత్తవంటిది దొరకదు

190 అరిటాకువచ్చి ముంటిమీదపడ్డా ముల్లువచ్చి అరటియాకుమీదపడ్డా, అరటిఆకుకే నష్టం

191 అరటిపండువలిచి చేతిలో పెట్టినట్టు

192 అరుంధతీ కనపడదు అద్ధానము కనపడదు అరవై వేల అప్పుమాత్రం కనపడుతున్నది

193 అరువంటే అరవై ఏనుగులను కట్టివేయమన్నట్లు

194 అర్ధమూప్రాణము ఆచార్యాధీనము, తాళము దేహమూ నా అధీనము

195 అర్ధములేనివాడు నిరర్ధకుడు

196 అర్దరాత్రివేళ అంకమ్మ సివాలు

197 అర్ధరాత్రివేళ మద్దెల దరువు

198 అర్జున భర్జున పడేర పిడుగు అన్నాడట

199 అలవాటులేని ఔపోసనంచేయబోతే మూతిమీసాలన్నీ తెగకాలినవి

200 అలివిగాని ఆలిని చేసుకొని మురిగిచచ్చేరా ముండాకొడుకు

201 అవలక్షణములుగల వానికి అక్షతలుఇస్తే అవతలికిపోయి నోట్లో వేసుకొన్నాడాట

202 అల్లి అడిగినది, ఇల్లి యిచ్చినది, మల్లి మాయం చేసినది

203 అల్లు డలిగితే కూతుర్ని తీసుకపోతాడు

204 అత్త ఎత్తుకొనీ తింటుంటే అల్లునికి మనుగుడుపా