పుట:Lokokthimukthava021013mbp.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

169 అయ్యకు రెండో పెండ్లి అని సంతొషమే గాని అమ్మకు సవతిపోరని యెరుగడు.

170 అయ్యనీటు అడిగితీరదు, అమ్మ దంచుకొని త్రాగుచున్నది.

171 అయ్య దాసండ్లకు పెడితే అమ్మ జంగాలకు పెట్టినది.

172 అయ్య రాకుంటే, అమావాస్య అట్టేవుంటుందా?

173 అయ్య వాతపెట్ట బర్రె బ్రతకనా?

174 అయ్యవారిని చెయబొతే కోతి అయినట్లు.

175 అయ్యవారు అటికంత, అయ్యవారి పెండ్లాము పుటికంత పుటికెతీసుకపోయి మూలయింట్లోపెట్టితే నక్క ఎత్తుకపొయింది నారాయణా.

176 అయ్య సవాశేరు లింగం అరవీశెడు

178 అయ్యో అంటే ఆరునెలల పాపంవస్తుంది

179 అరచేకుక్క కరవనేరదు.

180 అరతేరికి పండ్లు వచ్చుట

181 అరఛెతి రేగిబంటికి అద్దముకావలెనా?

182 అరచేతిలో ఉప్పుపెడితే ఆరునెలలు తలచుకోవలెను

183 అరచేతిలో వెన్నపెట్టుకొని నేతికి ఏడ్చిచినట్లు

184 అరచేతిలో వైకుంఠం చూపుతారు.

185 అరవ యేడుపు

186 అరవై యేండ్లయితే అరులుమరులు

187 అరవైయేండ్లవ తర్వాత అమ్మా అన్నాడట