పుట:Lokokthimukthava021013mbp.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

205 అరే గడ్దితినే కోమటీఅంటే యోమూయి బెల్లంతినే సాయబూ అన్నాడట; అట్లా అంతావేము కోమటీ అంటే అతనికి అది వాడుకు, నాకు యిది వాడుకు అన్నాడట

206 అల్లుడికి నెయ్యూలేదు ఆయన తోటివారికి నూనెలెదు.

207 అల్లుడికి వండిన అన్నం కొడుకుకు పెట్టుకున్నట్లు

208 అల్లుని మంచితనము వేముల తీసియులేదు

209 అల్లుల్లో మల్లు పెద్ద

210 అల్పునికి ఐశ్వరంవస్తే అర్ధరాత్రి వేళగొడుగు తెమ్మన్నాడట

211 అవధాన్లు గారు, ఆ కూర్చున్న వెధవావిడ తమరిభార్యా లేక అన్నగారిభార్య అంటే నా మొఖానికి అంతమాత్రం కూడానా అన్నట్లు

212 అవసరానికి ఆకులోపెట్టి నాకు నేలను పెట్టి

213 అవి వేకితో స్నేహముకన్నా వివేకితొ విరోధము మేలు

214 అవ్వను పట్టుకొని వసంతమాడినట్లు

215 అవ్వ వడికిననూలు తాత మొలత్రాటికి సరి

216 అవ్వాకావలెను బువ్వా కావలెను

217 అవ్వా గుర్రము ఒకటి అయినట్లు

218 అశ్రద్ధపితర్లకు యేతాం తర్పణం

219 అసలు సోమిదేవమ్మ అందులో వేవిళ్ళు

220 అన్నదానం చేసే మహారాజులు అన్నీ సప్లైచేసినా వడ్డింఛేవాడి చెయ్యి వెనక్కే

221 అడ్డాలనాదు బిడ్డలుగాని గడ్డాలనాడు బిడ్డలా

222 అచ్చివస్తేహనుమంతుడిమోఱ అచ్చిల్రాకుంటే కోతిమోర