పుట:Lokokthimukthava021013mbp.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3205 వాముపొచ పట్టేచోటేవుంటె ఇంకోభక్ష్యమే పట్టింతు

3206 విత్తము కొద్దీ విభవము విద్యకొద్ది వినయము

3207 వేషగాని అదుగులు వేట్లాటకు పనికి వచ్చునా

3208 శంఖలో పోస్తేగాని తీర్ధంకదు

3209 శంఖంలో పోస్తే తీర్ధము పెంకులో పోస్తే నీళ్లు

3210 శతడబ్బు సహస్రడబ్బు

3211 శనగలు తిని చేయి కదుకున్నట్లు

3212 శనివారపు వాన శనివారమే పోతుంది

3213 శని విరగడ పని వొబ్బిడి

3214 శరణార్ధిని లింగప్పా అంటే కందులు మూడు మాడలన్నాడట, చిన్నా పెద్దా బాగున్నారా అంటే పప్పులక్కవలె వుడుకుతుం దన్నాడట

3215 శల్య సారధ్యం

3216 శవానికి చేసిన అలంకారం

శా

3217 శాస్త్రుల్ల వారింట బుట్టి, సోమయాజుల వారింట జొచ్చి లవణమంటె దూడ రేణవని యెరుగనా