పుట:Lokokthimukthava021013mbp.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3187 వేషాలెల్లా గోసాలకే

3188 వేస్తివిరా కన్నం అంటే చేసివే కాపురంఅన్నట్లు

వై

3189 వైదికునిచేతి విడియంబు పవితబ్రతుకు

3190 వైద్యం నేరనివాడూ, వానకు తడియనివాడూ, రాగం తీయని వాడూ లేడు

3191 వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో

3192 వైద్యుడా నీ సంచిలో వేడినీళ్ళున్నవా!

3193 వైరికిగాని వడ్లు మెదగవు

3194 వైధ్యుని పేరుచెప్పితే రోగములు పోవునా

3195 వేషగాని అడుగులు వేట కొస్తయ్యా

3196 వ్యాధికి మందుగాని విధికి మందుందా

3197 వ్యాసప్రోక్తమా పరాశరప్రోక్తమా

3198 వ్రతం చెడ్డా సుఖం దక్కాలి

3199 వ్రాత కరణం

3200 వ్రాతగదే కూతురా అంటే కోతి మొగుడే అమ్మా అందిట

3201 వ్రాయగా వ్రాయగా కరణం దగ్గగాదగ్గగా మరణం

3202 వ్రాతరాజ్యమేమంటే గ్రహచారం గాడిదల మేపమన్నదట

3203 వ్రాసేవాణ్ణి, కోసేవాణ్ణి గీసేవాణ్ణి నమ్మరాదు

3204 వ్రైదికపుపిల్లి వ్రత్తిపలకవేఅంటే మ్రావు అందిట