పుట:Lokokthimukthava021013mbp.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శి

3218 శింగన్న అద్దంకి పోనూ పోయి రానూ వచ్చాడు

3219 శింగినాదం జీలకర్ర

3220 శింగి బిడ్దను కంటే శింగడు కారం తిన్నట్లు

3221 శిగ్గు అనగా తోటకూర వంటిది

3222 శిగ్గు చెడ్డా బొజ్జ పెడితే చాలు

3223 శిగ్గులచేటు పెద్దల పెండ్లి

3224 శిగ్గులేని ముఖానకు నవ్వే అలంకారం

3225 శితకంఠ వాచస్పతి క్రేంకారం

3226 శిరికొద్దీ చిన్నెలు మగని కొద్దీ వన్నెలు

3227 శిరిపోయినా చిన్నెలు పోలేదు

3228 శిలాభోగం, స్థలాభోగం, నరభోగం కానరావు

3229 శిలా శాసనం ఫలా పాదకం

3230 శివరాత్రి జీడిపెందెలు, ఉగాదికి వూరగాయ

3231 శివరాత్రికి శివశివా అని చలిపోతుంది

3232 శివునాజ్ఞ లేక చీమైనాకుట్టదు

శు

3233 శుభం పలకరా పెండ్లికొడకా అంటే పెండ్లి కూతురు ముండ యెక్కడున్న దన్నాడట

3234 శుభాలు ముంచి దీపాలు ఆర్పేవాడు