పుట:Lokokthimukthava021013mbp.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3070 వాడు చెడ్డాడు తాగుబోతు నాకు వొక ముంతెడు కల్లు పొయ్యి అన్నాడట

3071 వాడు చెప్పింది వసిష్ట వాక్యం

3072 వాడు వెక్కిరిస్తే నీకెక్కడ తొర్రి పోయినది

3073 వాడు పట్టినది చింతకొమ్మగాని ములగ కొమ్మగాదు

3074 వాంతోనేగి మొగుడితో రాగిలేదు

3075 వానరాకడ ప్రాణం పోకడ తెలియదు

3076 వానలకు మఖకార్తె శ్వాసములకు చిత్తకార్తె

3077 వానరం తోడి వాలంవలె

3078 వానలుకురిస్టే వాతలు మానునా బిడ్డలను కంటే రంకులుమానునా

3079 వానలు కురుస్తుంటవి కప్పలు అరుస్తుంటవి

3080 వానలేని వట్టిపిడుగు

3081 వానవుంటే కరువు పెనిమిటివుంటే పేదరికముల్/ఏదు

3082 వానికి తెల్లనివి పాలు నల్లనివె నీళ్లు

3083 వానపని యేకాధ్యర్య మాధుకరం

3084 వాని యింట్లో యిలిభిక్షం బలిభిక్షం పుట్టదు

3085 వామాక్షి చెప్పుచున్నది

3086 వాయసమును బాలలోముంచిన హంసయగునా

3087 వారిద్దరికి నిప్పు నీళ్లుగా నున్నది

3088 వాసానికితగ్గ కూసం

1089 వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు తులాభారం తూగితే కరెడ్ల కామక్క వంకాయలభారం తూగింది