పుట:Lokokthimukthava021013mbp.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3053 వరికి వొకవాన వూదకు వొకవాన

3054 వలచివస్తే మేనమామకూరుగు వరస కాదన్నట్లు

3055 వసిష్టునివాక్కున విశ్వామిత్రుడు బ్రహ్మఋషి అనిపించు కోవలె

3056 వస్తావు వస్తావు నాకొరకు వచ్చికూచున్నా డు నీకొరకు

వా

3057 వాండ్లు పొక్కటి రాళ్ళ రీతి వున్నారు

3058 వాకిలి దాటి వరణాశి యెంతదూరమన్నట్టు

3059 వాగుదాటేదాకా వోడమల్లయ్య వాగుదాటింతర్వాత పోడిమల్లయ్య

3060 వాచినమ్మకు పాసినకూడుబెట్టితే మాఅత్త పరమాన్నం బెట్టిందని యిరుగు పొరుగింట చెప్పు కున్నట్లు

3061 వాడ మీదవుండే వరకు వొడమల్లయ్య దిగగానే బోడి మల్లప్ప

3062 వాడలో నాపోక చక్క సగంవుంది భాయి

3063 వాడవదినకేల వావివర్తనములు

3064 వాడితండ్రి మతండ్రి నయాం మగవాళ్లు

3065 వాడిపని గూట్లోకి వచ్చింది

3066 వాడిపని తెల్లవారింది

3067 వాడిమాట పిండికీ అవుతుంది పెడుకూఅవుతుంది

3068 వాడిలో నాపోక చెక్క సగంవున్నది భాయీ

3069 వాడాడినది ఆట పాడినది పాట