పుట:Lokokthimukthava021013mbp.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వి

3090 వింటే భారతం వినవలె తింటే గారలు తినవలె

3091 వింతలేని ఆవులింత పుట్టదు

3092 విందూమందూ మూడుపూటలు

3093 విందు మర్నాడు మందు

3094 విందులేని కూదు మందు

3095 వికారమువాడు దుకాణము పెట్టితే వచ్చినగిరాకి అటే మరలి పోయనట

3096 విక్రమార్కునివంట్ రాజు వుంటే భట్టివంటి మంత్రి వుంటాడు

3097 విగ్రహపుస్టి నైవేద్యనష్టి

3098 విఘ్నేశ్వరుడి పెండ్లికి వేయి విఘ్నాలు

3099 విడిబడితే గుఱ్ఱం గాడిదతో సమానం

3100 విడువుమంటే పాముకుకోపం కరువుమంటే కప్పకు కోపము

3101 విత్తనం వొకటివేస్తే చెట్టు వేరు మొలచునా

3102 విత్తనాలకు పోయిన రెడ్డి వోదెలెత్తుక వచ్చినాడు

3I03 విత్తము కొద్దీ వైభవము, విద్యకొద్దీ వినయము

3104 విత్తుకన్నా క్షేత్రం మెరుగు

3105 విత్తుముందా చెట్తు ముందా

3106 విదియనాడు కనపడని చంద్రుడు తదియనాడు తానె కనుపించుతాడు

3107 విధివస్తే పొదలడ్డమా

3108 వినయము లోకవస్యము, విద్య రాజవశ్యము