పుట:Lokokthimukthava021013mbp.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2673 మాదిగవాడి బార్త్యెనా మండేకాలికి చెప్పులేదు

2674 మాధల్వభొట్లకు పడిశం యాటా రెండుసార్లు రావటం, వచ్చినప్పుడల్లా 6 మాసాలు వుండటం

2675 మానంపోయిన వెనుక ప్రాణమెందుకు

2676 మానని రోగానికి మందు వద్దు ఈనిన కుక్క వున్నది మాయింట

2677 మానిపోయిన పుండు మళ్లి రేపినట్లు

2678 మానును చూచేవా మనును పట్టిన భూతాన్ని చూచేవా

2679 మాను పండ్లు మాను క్రిందనే రాలుతవి

2680 మానుపిల్లి అయినా మట్తి పిల్లి అయినా ఎలుకను పట్టిందే పిల్లి

2681 మాను పేరు చెప్పి పండ్లమ్ముకోవచ్చు

2682 మానెడు పిండవచ్చును గాని చెట్టె డెక్కించరాదు

2683 మా పిల్లవానికి ముప్పదిరెండు గుణములున్నవి గాని రెండు తక్కువ

2684 మామతో కూడా మంచం అల్లి తాతతో దడికట్ట వచ్చిందట

2685 మామిడి మగ్గితే సజ్జలు పండును

2686 మామిళ్లకు మంచు చెరువు

2687 మామిళ్లు కాస్తే మశూచికములు మెండు

8688 మాలకూటికి లోబడ్డా, పప్పుబద్ద దొరకదు

8689 మాలపల్లెలో మంగళాష్ట కాలు