పుట:Lokokthimukthava021013mbp.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2690 మాలమాట నీళ్ళమూట

2691 మాలలకు మంచాలు బ్రాహ్మణులకు పీటలు

2692 మాలాయ గారికి కోలాయ గారు గురువు

2693 మాశిపెద్ద మాశివుండావు బుద్ది గాడ్దె బుద్ది వుండావు

2694 మారికి వారశూల

2695 మార్గశిరమ లో మాట్లాడటానికి పొద్దువుడదు

2696 మార్గ సిరములో మహత్తయిన చలి

2697 మాశిమీద మా శియెక్కి కూర్చుంటే మోసిమోసి చచ్చినా నన్నాడట

2698 మాసెనభోమణి నక్కలు గూసెన్

2699 మాసొమ్ము మాకిచ్చుట మడిమాన్యము లిచ్చుట

మి

2700 మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగినూనె

2701 మింగరాని కడి

2702 మింటికన్నాపొడుగు నగిరికన్నా ధాష్టీకంలేదు

2703 మిండలను మరగిన అమ్మ మీగడతిన్న అమ్మ వూరు కుండదు

2704 మిండడి యీవియెంతో లంజమక్కువ అంతే

2705 మిగిలిన సున్నాన్ని నొగిలినరాజును వదలకూడదు

2706 మిడతంబొట్లు జోశ్యము

2707 మితము దప్పితే అమృతమైనావిషమే

2708 మిధునంలో మొక్క మీసకట్టున పుట్టిన కొడుకు