పుట:Lokokthimukthava021013mbp.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా

2653 మాంసం తింటామని యెముకలు దండవేసు కుంటారా

2654 మాంసం మాంసమును పెంచును

2655 మాటకు కాట తెగులు నీటికి నాచు తెగులు

2656 మాటకు మాట శృంగారం పేటకు కోట శృంగారం

2657 మాటఘనం మానికపిచ్చ

2658 మాట తప్పినవాడు మాలవాడు

2659 మాటలకు పేదరికంలేదు

2660 మాటలకు పనులకు చాలా దూరం

2661 మాటలకు మల్లి, పనికి యెల్లి

2662 మాటలు కోటలు దాటుతవి, కాలు గడపదాటదు

2663 మాటలు తేటలు మాయింట, మాపటి భోజనము మీ యింట

2664 మాగిలి దున్నితే మానికైనా పండును

2665 మాటలు నేర్విన కుక్కను వేటకు బంపితే వుజ్జో అంటే వుజ్జో అన్నదట

2666 మాటలు తల్లి పెట్టు మారు తల్లి

2667 మాట లెన్ని చెప్పినా మామగారి పొత్తు వదలనందిట

2668 మాఘ మాసపు వాన మొగుడు లేని చాన

2669 మాఘ మాసపు చలి మంటలో పడ్డా తీరదు

2670 మాఘమాసంలో మ్రాకులు సైతం వణుకును

2671 మాదిగ మంచానకు తలవైపూ కాళ్ళవైపూ వొకటే

2672 మాదిగ మల్లి కంసాలి యెల్లి