పుట:Lokokthimukthava021013mbp.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుసునన్నట్లు

2095 ఫట్టణము పోయిన గాడిదె పల్లెకుపోయిన గాడిదను కరచినదట

2096 పట్టపగలు చుక్కలు పొడిపిస్తాడు

2097 పట్టినది చింతకొమ్మగాని ములగ కొమ్మకాదు

2098 పట్టినది బంగారం ముట్టినది ముత్యము

2099 పట్టినవాడు పరక పిల్లంత అంటే పట్టనివాదు మెట్టపిల్ల అన్నట్లు

2100 పట్టిపట్టి పంగనామాలుదిద్దితే గోడదాటున గోకివేసెనట

2101 పట్టివిడిసిన మండ మబ్బువిడచినయెండ మొగుడువిడచిన ముండ

2102 పట్టు కత్తిరించినట్లు మాట్లాడవలెను

2103 పడమట కొరుడు

2104 పడమట కొర్రుపట్టితే పదిళ్ళమీద రాజనాలు

2105 పడమట కొర్రుపట్టితే పాడియావు రంకివేయును

2106 పడమట మరసిన పదిగడియలకు వర్షం

2107 పడమట మెరిస్తే పందియైనా నీళ్ళకు దిగదు

2108 పడమరకు వూరేడుపిట్టంత మేఘమునడిస్తే పాతాళం బ్రద్దలగునంత వర్షం కురుస్తుంది

2109 పడవ వొడ్దుచేరితే పడవవానిమీద ఒకపొద్దు

2110 పడిశము పదిరోగాలపెట్టు

2111 పడుకోవడము పాడుగొడ్లల్లో కలవరింతలు మిద్దె యిండ్లల్లో