పుట:Lokokthimukthava021013mbp.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2112 పడుచుల కాపురం చితుకులమంట

2113 పడుచుల సేద్యం పాకానికి రాదు

2114 పత్తికి పదిచాళ్లు ఆముదముకు ఆరుచాళ్లు జొన్నకు ఏడు చాళ్ళు

2115 పత్తిగింజ తింటావా బసవన్నాఅంటే ఆహాఅన్నట్లు గంతకట్టనా బసవన్నాఅంటే ఊహూ అన్నట్లు

2116 పదిమంది గలవాడు వందయినా సేద్యం చేస్తాడు

2117 పదిమంది చేసినపని పాదుపాడు

2118 పదిమందితోటిచావు పెండ్లితో సమానము

2119 పదిమందిలోపడ్డ పాము చావకపోదు (చావదు)

2120 పదిరాళ్ళువేస్తే ఒకటైనా తగలదా

2121 పదునుతప్పినా అదును తప్పినా పన్ను దండుగ

2122 పనిఅంటే నావొళ్ళు భారకిస్తుంది భోజనమంటే నా వొళ్లు పొంగివస్తుంది

2123 పనిగల మగవాదు పందిరి నేస్తే కుక్కతోకతగిలి కూలబడేనట

2124 పనిగలవారియింట్లో పైసలఏట్లాట పనిలెనివరియింట్లో పాపొసుల ఏట్లాట

2125 పరమేశ్వరుడు కన్ను విప్పితే కాలమేఘాలు కకాలికవైపోతాయు

2126 పని చెయ్యనివాడు యింటిదొంగ పన్నియ్యనివాడు దివాణానికి దొంగ

2127 పనితక్కువ పాకులాట యెక్కువ