పుట:Lokokthimukthava021013mbp.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2073 పండనినేల పుట్టెడు దున్నటంకంటె, పండేనేల పందుంచాలును

2074 పండు జారి పొలాల్లో పడింది

2075 పండే పంట పైరులోనె తెలుస్తుంది

2076 పందికి పెడతల బుద్ధి

2077 పంది కేలరా పన్నీరు బుడ్డి

2078 పందికొక్కును పాతర బెట్టితే వుంటుందా?

2079 పందిని నందిని పందిని నందిని చేసేవాడు

2080 పందిలిపడి చచ్చినవాడు యిల్లు విరిగిబ్రతికినవాదు లేరు

2081 పంది యెంతబలిసినా నంది అవునా

2082 పందుంతిన్నా పరగడుపే యేదుంతిన్నా ఏకాదశే

2083 పక్క వుండు పెంచుతావేమి!

2084 పక్కలో కత్తి

2085 పగటిమాటలు పనికి చేటు, రాత్రి మాటలు నిద్రచేటు

2086 పగలు చస్తే పాతకిలేదు, రాత్రిచస్తే దీపానికిలెదు

2087 పగలు పక్క చూచి మాట్లాడు, రాత్రి అదిరద్దు

2088 పగలెల్లా బారెడు నేశారు, దీపంతేరా దిగనేస్తాను

2089 పగలు తల్లి రాత్రి భార్య

2090 పగనానింట పదిచిచ్చాలుపోయినా పోయినీవే

2091 పచ్చిగడ్డివెస్తే భగ్గుమంటుంది

2092 పగలు రేజీకటి రాత్రి హుటా హుటి

2093 పచ్చివెలక్కాయ గొంతున పడ్డట్టు

2194 పట్టపగలు కన్నంవేస్తావేమిరాఅంటే నాకక్కుర్తి నీకేమి