పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

- తృతీయ - చతుర్ది - పంచమి - షష్ఠి - సప్తమి - విభక్తులకు శత్రర్దక చువర్ణము నందలి ద్రుతమునకు సంధి వైకల్పికము.

నన్నున్ + అడిగె = నన్నడిగె - నన్నునడిగె
నాకొఱకున్ + ఇచ్చె = నాకొఱకిచ్చె - నాకొఱకునిచ్చె
నాకున్ + ఆదరువు = నాకాదరువు - నాకునాదరవు
నాయందున్ + ఆశ = నాయందాశ - నాయందు నాశ
ఇందున్ + ఉన్నాడు = ఇందున్నాడు - ఇందు, నున్నాడు
ఎందున్ + ఉంటివి = ఎందుంటివి - ఎందునుంటివి
చూచుచున్ + ఏగెను = చూచుచేగెను - చూచుచునేగెను.

4. యడాగమసంధి :

సంధిలేని చోట, స్వరంబుకంటె పరంబైన స్వరంబునకు, యడాగమంబగు.

యట్ + ఆగమము = యడాగమము.

'యట్‌' లోని లు కారము ఈ చేయబోవు యడాగమము. సంధిలోని పర పదము మొదటనే, చేరవలెనని, సూచించి పోవును. య కారములోని అ కారము ఉచ్చారణా ర్దము అని గ్రహించవలెను. చేయబడు ఆగమము కేవలము 'య్‌' మాత్రము అని గ్రహించవలెను. సంధి రానిచోట, అచ్చు తర్వాత నున్న, అచ్చునకు, యకారమాగమ మగునని అర్దము. ఆగమమనగా మరియొక అక్షరము సంధిలో వచ్చి చేరుట.

సులభ వ్యాకరణము