పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/73

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
73

iii. మధ్యమ పురుష క్రియలందిత్తునకు సంధి యగు.

నీవు - మీరు అను మధ్యమ పురుష క్రియలందలి హ్రస్వమగు ఇ కారమునకు సంధి తప్పక జరుగును.

ఉదా : - ఏలితివి + అపుడు = ఏలితివపుడు
         ఏలితి + ఇపుడు = ఏలితిపుడు
         ఏలితిరి + ఇపుడు = ఏలితిరిపుడు.

iv. క్త్వార్దంబైన 'యిత్తు' నకు సంధి లేదు. క్త్వార్దమనగా భూతకాలమును తెల్పు, అసమాపక క్రియ. అట్టి క్రియ లందలి హ్రస్వ ఇ కారమునకు సంధి లేదు.

ఉదా : - వచ్చి + ఇచ్చిరి = వచ్చియిచ్చిరి.

ఇత్వసంధి కొన్నిచోట్ల వైకల్పికముగను, కొన్నిచోట్ల నిత్యముగను, మరికొన్నిచోట్ల నిషేధముగను జరుగును.


3. ఉకారసంధి :

ఉత్తునకు అచ్చుపరమగు నపుడు సంధి నిత్యము. హ్రస్వమగు ఉ కారమునకు అచ్చుపరమగునపుడు సంధి జరుగును.

ఉదా : - రాముడు + అతడు = రాముడతడు.
         సోముడు + ఇతడు = సోముడితడు.
         అతడు + ఉండెను = అతడుండెను.
         వాడు + ఎవడు = వాడెవడు.

ఉ కారసంధి కొన్నిచోట్ల వైకల్పికము. ప్రధమేతర విభక్తి శత్రర్దక చు వర్ణము నందున్న ఉ కారమునకు సంధి వైకల్పికము. ప్రధమేతర విభక్తులనగా ద్వితీయ

సులభ వ్యాకరణము