31
నిత్యైక వచనములు
బహు వచనములు లేనివి, నిత్యైక వచనములు.
1. బంగారము - వెండి - రాగి - ఇనుము - సీసము - కంచు - ఇత్తడి - తుత్తనాగము మొదలైనవి.
2. నిన్న - మొన్న - రేపు - మాపు - అప్పుడు - ఇప్పుడు - ఎప్పుడు - మొదలగు కాలముల దెలుపునవియు, అచ్చట - ఇచ్చట - అట మొదలగు స్థలముల దెలుపునవి.
3. కేలు - ఇరులు మొదలగు కొన్ని పదములును, ప్రత్తి - దూది మొదలగు సస్య వాచకములు.
4. నలుపు - తెలుపు - పసుపు - మొదలగు రంగుల తెల్పునవి.
5. సరి - సాన - ఈడు - జోడు - ఎన - ఉద్ది - దీటు మొదలగు సమానార్థకములు.
6. నూనె - నేయి - చమురు - కర్పూరము - బెల్లము మొదలగు రసవాచకములు.
7. బియ్యము - జీలకఱ్ఱ - మొదలగు ధాన్య వాచకములును - పసుపు - ఉప్పు - చింతపండు పులుసు మొదలగు సంభార వాచకములును నిత్యైక వచనములు.
నిత్య బహువచనములు
1. వడ్లు - పెసలు - కందులు - మినుములు - సెనగలు - జొన్నలు మొదలగు ధాన్య వాచకములు.
సులభ వ్యాకరణము