పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

2. దాగుడు మూతలు - అచ్చనగాయలు - ఓమన గుంటలు - చల్లుడు పిచ్చెలు - గుజ్జెన గూళ్లు - గొబ్బిళ్లు - మొదలగు క్రీడా వాచకములు.

3. ఇద్దరు - ముగ్గురు - పలువురు - అందరు - ఇందరు - ఎందరు - కొందరు మొదలగు సంఖ్యేయార్దకములు.

4. గుగ్గిళ్లు - కురులు - పులకలు - పేలాలు - బొరుగులు - మనము (మీరు + మేము) మొదలగునవి నిత్య బహువచనములు.

విభక్తుల ప్రయోగము

తృతీయ యందు చేత - చే ప్రత్యయములకు 'చేసి' అను అవ్యయమును, తోడ - తో ప్రత్యయములకు మై - మేఱు అను అవ్యయమును వచ్చుట కలదు.

1. దానం చేసినా కార్యంబయ్యె.
   అతని సాయముంజేసి బ్రతుకగలిగితి.
   రయముమై జనుదెంచె శ్రద్ధమై వినిరి.

2. చతుర్థీ ప్రత్యయమునకు పొంటె అను అవ్యయము వచ్చుట కలదు. జగముల రక్షించు పొంటె రాముడవతరించె.

3. పంచమి యందు వలనకు నుండి ఎడ - కొలె - పోక అవ్యయములును, కంటెకు కన్న అవ్యయమును వచ్చును. నీ నుండి బ్రదికితి. దొంగల యెడ భయము - అతని కన్న ఇతడు పెద్ద మొ..నవి. ఈ ఉండికి - కొలె కొలె అవ్యయములు వచ్చును. నాటి నుండి - నాటగొలె - నాటగోలె మొ..నవి.

సులభ వ్యాకరణము