ఈ పుట ఆమోదించబడ్డది
30
పై చెప్పబడిన ప్రధమా విభక్తి ప్రత్యయములు ఎవ్వియు కనిపింపకున్నను, ఆ పదము నామవాచకముగా గాని, సర్వనామముగాగాని యుండి ఇతర విభక్తి ప్రత్యయము లెవ్వియు నందు కన్పింపకున్నచో అది ప్రధమాంతముగ గ్రహించవలెను.
చిలుక - అన్న - సీత - రాజు - హరి - మొ..నవి.
విశేషాంశములు
సంస్కృత పదములు కొన్నింటికి - ఇ - ని- అ - ఇక మొదలగు ప్రత్యయములు చేర్చుట వలన పుల్లింగములు స్త్రీ లింగములుగా మారును.
| పుం. | -స్త్రీ. (ఇ) | పుం. | -స్త్రీ (అ) |
| జనకుడు | -జనని | బాలుడు | -బాల |
| బ్రాహ్మణుడు | -బ్రాహ్మణి | సుతుడు | -సుత |
| పద్మాక్షుడు | -పద్మాక్షి | పద్మనేత్రుడు | -పద్మనేత్ర |
| ప్రభువు | -ప్రభ్వి | శూద్రుడు | -శూద్ర |
| సుందరాంగుడు | -సుందరాంగి | ధన్యుడు | -ధన్య |
| దేవుడు | -దేవి | ప్రియుడు | -ప్రియ |
| కర్త | -కర్త్రి |
| పుం. | -స్త్రీ. (ని) |
| బుద్ధిశాలి | -బుద్ధిశాలిని |
| చక్రవర్తి | -చక్రవర్తిని |
| రాజు | -రాజ్ఞి |
| యశస్వి | -యశస్విని |
| పుం. | -స్త్రీ. (ఇక) |
| బాలుడు | -బాలిక |
| దూతుడు | -దూతిక |
| పుత్రుడు | -పుత్రిక |
| పరిచారకుడు | -పరిచారిక |
సులభ వ్యాకరణము