పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

141

శ్రీరాముడు కల్పవృక్షమేకాని భూమిలో ఉన్నది.
ఇనుము విరిగిన నదుకును, మనసు విరిగిన నదుకదు.

(18) నిదర్శనాలంకారము :

ఉపమాన ధర్మము ఉపమేయగతముగ చెప్పుట నిదర్శనము.

దాతకు సౌమ్యతయన చంద్రునకు కళంకము లేకుండుట.

ఇచ్చట సౌమ్యత అను ఉపమేయ ధర్మము అకళంకితయను ఉపమాన ధర్మముగ చెప్పబడినది. హరిని వదలి అన్యులు గొల్చువాడు, కామధేనువును వదలి కాసరమును బిదుకును.

(19) తుల్యయోగితాలంకారము :

కేవల ప్రకృతమునకుగాని, కేవల అప్రకృతములకు గాని, ఏక ధర్మమును చెప్పుట తుల్యయోగిత.

కలువలును - కాపురుష హృదయములును వికసింపనీ రాజు దయించెను.

కలువలు - కాపురుష హృదయములును, ప్రకృతములు - వానికి ఉదయించుట అను క్రియాయోగము చెప్పబడినది.

పామునకు పాలు పోసినను, విషము పోసినను ఫలమొక్కటియే.

సులభ వ్యాకరణము