పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142


(20) వ్యాజస్తుతి :

స్తుతిచే నిందను గాని, నిందచే స్తుతిని గాని తెల్పుట వ్యాజస్తుతి.

ఆర్యా ! నీవు మహనీయుడవు, పర ధనమును స్వధనముగా జూతువు.
శ్రీరామా ! ఏమి నీ ఘనత. పాపులకు కూడ పరమపదము నిచ్చితివి.

(21) అప్రస్తుతప్రశంస :

అప్రస్తుతముచే, ప్రస్తుతము తోచుట, అప్రస్తుత ప్రశంస.

సతీ ! నీవేల పతిని వదలి పరుల ప్రశంసింతువు ?

ఇట రాముని వదలి అన్యునికొల్చువారి నింద ప్రస్తుతముగా దోచును. అట్లే -

అధికారుల ద్వారముల కాచియుండక ఆకలముల కాలము గడుపు చుండుటచే, హరిణమే ప్రశంస నీయము.

(22) కావ్యలింగము :

సమర్ధింపదగిన దాని, సమర్ధించుట కావ్యలింగము.

నా హృదయమున నీశ్వరుడు కలడు. కాముని గెల్చుటెంత ఘనకార్యము?

కాముని గెల్చుట ఈశ్వరుడు హృదయమున నుండుటచే సమర్దితము.

సులభ వ్యాకరణము