పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140


(15) ఉల్లేఖాలంకారము :

అనేకులు అనేక విధముగా గాని, విషయమును బట్టి ఒకడే అనేక రూపములుగా గాని, ఆరోపింపబడిన ఉల్లేఖాలంకారము.


స్త్రీలు కాముడనియు, యాచకులు కల్పవృక్షమనియు, రిపులు యముడనియు, ఈ రాజును దలంతురు.
మాటలలో గురువు - కీర్తి యందర్జునుడు - శరాసనమున భీష్మడనియు నీతని దలంతురు.

(16) దీపకాలంకారము :

ఉపమానమునకు, ఉపమేయమునకు, అనేక ధర్మములు చెప్పుట, దీపకాలంకారము.


మదముచే, కలభమును, ప్రతాపముచే సూర్యుడును ప్రకాశింతురు.


ప్రకాశించుట అను ధర్మము ఉపమేయమగు కలభమునకు, ఉపమానమగు సూర్యునకు చెప్పబడినది.


మదముచే కలభము రాణించును.

ప్రతాపముచే సూర్యుడు ప్రకాశించును అని పదావృత్తి యున్న ఆ వృత్తి దీపకము.

(17) వ్యతిరేకాలంకారము :

ఉపమాన, ఉపమేయములకు, భేదము చెప్పుట వ్యతిరేకాలంకారము.

సులభ వ్యాకరణము