పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

వలె, అను ఉపమావాచకము లేదు. మెత్తని అను సమానధర్మము లేదు. చిగురు అను ఉపమానము, కేలు అను ఉపమేయము. ఈ రెండే కలవు - కాన నిది లుప్తోపమ.

(2) రూపకాలంకారము (Metaphor)

లక్షణము : ఉపమాన, ఉపమేయములు, రెండింటికి భేదమున్నను, భేదములేనట్లు చెప్పుట - (లేక) ఉపమేయమునందు ఉపమానధర్మమును ఆరోపించుట, రూపకాలంకారము.


లక్ష్యము : లతాలలనలు రాజుపై కుసుమాక్షితలు చల్లిరి.


ఇందు లతలుపమేయము. లలన లుపమానము. కుసుమము లుపమేయము. అక్షతలు ఉపమానము. అక్షతలు చల్లుట ఉపమానములగు స్త్రీల ధర్మము. ఆపని ఉపమేయములైన లతలు చేసినట్లు వర్ణింపబడినది. రాజు ఉద్యానవనమునకు పోయినపుడు, లతలనుండి పువ్వులాతనిపై రాలినవని సారాంశము.

మరి కొన్ని ఉదాహరణలు : -
నీ వాగమృతమును కర్ణపుటము లంద్రావితిమి
కవి సాగరుని యందు సూక్తి రత్నములున్నవి

         విద్యాధనమును చోరులు దొంగిలింపలేరు.

(3) అనన్వయాలంకారము.

లక్షణము : ఒక పదార్ధమునే యుప మేయముగను ఉపమానముగను చెప్పుట.

సులభ వ్యాకరణము