పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

133


అర్ధాలంకారములు

(1) ఉపమాలంకారము (semile)

లక్షణము : ఒక వస్తువును, మరియొక ప్రసిద్దమైన వస్తువుతో, పోల్చినచో, ఉపమాలంకారమగును.


లక్ష్యము : ఆమె ముఖము చంద్రబింబము వలె అందముగా నున్నది.


ఉపమాలంకారమునందు నాలుగు అంశములుండును.

1. ఉపమేయము.
2. ఉపమానము
3. సమానధర్మము
4. ఉపమావాచకము.

మనమేవిషయమును గురించి చెప్పుకొనుచుంటిమో, అది ఉపమేయము,
ఆమె ముఖము = ఉపమేయము
మనమే ప్రసిద్ధమైన వస్తువుతో పోల్తుమో అది ఉపమానము.
చంద్రబింబము.
ఆమె ముఖమునకు - చంద్రబింబమునకుగల
సమానగుణము - సమానధర్మము
ఉపమా వాచకము - వలె
ఉపమానపదములు - వలె - రీతి - వగిరి - వంటి - చందము - మొదలైనవి. ఈ నాల్గింటిలో ఏ ఒక్కటి లోపించినను లుప్తోమమాలంకారమగును. లోపించుట అనగా చెప్పు వాక్యము నందు లేకుండుట.

ఆమె చిగురుంకేలు నంటుకొంటివి.

చిగురువలె మెత్తని, కేలు (చేయి అని అర్థము) ఇందులో

సులభ వ్యాకరణము