పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

135

లక్ష్యము : చంద్రుడు చంద్రుని వంటివాడు.
               ఆకసమాకసము వంటిది.

(4) ఉపమేయోపమ.

లక్షణము : ఉపమానమును, ఉపమేయముగను, ఆ ఉపమేయమునే, ఉపమానముగను చెప్పుట.


లక్ష్యము :

1. ధర్మము అర్ధము వలెను, అర్ధము ధర్మము వలెను, అలరారుచున్నది.

2. కొండవలె ఏనుగును, ఏనుగునట్లు కొండయు, నుండ, వాగువలె మదధారయు, మదధారవోలె వాగు నొప్పుచున్నవి.

(5) అతిశయోక్తి (Hyper bole)

లక్షణము : లోక ప్రసిద్ధమైయున్న వస్తువు స్థితిని, అతిక్రమించి చెప్పుట అతి శయోక్తి అలంకారము. కవి ప్రౌడోక్తియే దీనికి జీవనము.

లక్ష్యము : ఆ పురము నందలి సౌధములు మిన్నంటియున్నవి.

సౌధములు మిక్కిలి యున్నతములై యుండవచ్చును. అంతియేగాని మిన్నంటి యుండుట పొసగని కార్యము. కవి ప్రౌడోక్తిచే, వస్తువు స్థితి అతిక్రమించి చెప్పుచున్నాడు.


(6) దృష్టాంతరము.

లక్షణము : ఉపమేయముతో ఉపమానమును బింబ ప్రతిబింబ భావముతో, దృష్టాంతీకరించుటయే, దృష్టాంతాలంకారమనబడును. ఇందు రెండు వాక్యములుండును.

సులభ వ్యాకరణము