ఈ పుట ఆమోదించబడ్డది
122
ఉదా :
ర | స | జ | జ | భ | ర |
UǃU | ǃǃU | ǃUǃ | ǃUǃ | Uǃǃ | UǃU |
స్నాతకుం | డునుఋ | త్విజుండు | నుసద్గు | ణుండును | నిష్టుడున్ |
యతి - స్నా - స - 1 - 11 ప్రాస - త.
6. తరలము :
ప్రవర, రుద్రవిరామయుక్తి సభంబులన్, రసజాగముల్
కవిజనాశ్రయ ! పొందియుందముగా ధరందరలంబగున్.
న, భ, ర, స, జ, జ, గ అను గణములు వరుసగా నుండి, 12వ అక్షరము యతి చెల్లిన తరలమగును. అక్షరములు 19.
ఉదా :
న | భ | ర | స | జ | జ | గ |
ǃǃǃ | Uǃǃ | UǃU | ǃǃU | ǃUǃ | ǃUǃ | U |
ధరణి | లోగల | రాజులె | ల్లరుదా | రుణక్ష | యకాల | సా |
యతి - ధ - దా - 1 - 12. ప్రాస - ర.
సులభ వ్యాకరణము