పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

121


4. మత్తేభము : -

        స్మయదూరా ! విలస త్రయోదశ యతిన్ మత్తేభ వి క్రీడితా
        హ్వయమయ్యెన్, సభరమ్ములున్, సమయన వ్రాతంబులున్ గూడగాన్.

స, భ, ర, న, మ. య. వ - అనుగుణములు వరుసగా నుండి, 14 వ అక్షరము యతి చెల్లిన, మత్తేభము. అక్షరములు 20.

ఉదా :

ǃǃU Uǃǃ UǃU ǃǃǃ UUU ǃUU ǃU
మహిళా మండలి కీవునే తవయి సన్మానం బులన్‌గాం చియీ

యతి - మ - న్మా - ప్రాస - హి.

5. మత్తకోకిల :

        శ్రావకాభరణాంక ! విన్ రసజాభ రేఫలదిగ్విరా.
        మావహంబుగ, మత్తకోకిల యండ్రు, దీని కవీశ్వరుల్;

ర, స, జ, జ, భ, ర - అను గణములు వరుసగా నుండి 11 వ అక్షరము, యతి చెల్లిన మత్తకోకిల. అక్షరములు 18.

సులభ వ్యాకరణము