ఈ పుట ఆమోదించబడ్డది
123
7. పంచచామరము :
జరల్, జరల్, జగంబు, గూడ, సన్నుతిన్ రచింపగా,
బరాజి తారివీర ! పంచచామరంబగున్, వెసన్.
జ, ర, జ, ర, జ, గ అను గణములు వరుసగా నుండి 10వ అక్షరము యతి చెల్లిన పంచచామరము. అక్షరములు 16.
ఉదా :
జ | ర | జ | ర | జ | గ |
ǃUǃ | UǃU | ǃUǃ | UǃU | ǃUǃ | U |
కిరాత | రాతలం | పుహత్తి | కేవలం | బుభుక్తి | మై |
యతి - కి - కే. ప్రాస 'రా'
8. మానిని :
కారకముల్ క్రియగన్గొన, నేడు భకారము లొక్కగ కారముతో,
గారవమైచనగా, వళులన్నియు గల్గిన, మానిని కామనిభా !
భగణములు ఏడు వరుసగానుండి చివర ఒక గురువున్న మానిని వృత్తము. యతి 13వ అక్షరము. అక్షరములు. 22.
ఉదా :
భ | భ | భ | భ | భ | భ | గ | |
Uǃǃ | Uǃǃ | Uǃǃ | Uǃǃ | Uǃǃ | Uǃǃ | Uǃǃ | U |
చూచుచు | వీనుల | కింపెస | గన్‌విను | చున్‌శుక | కోకిల | సుస్వర | ముల్ |
యతి - చూ - చున్ - ప్రాస - చు.
సులభ వ్యాకరణము