పుట:Leakalu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మరొక నాటకం వ్రాతామని కథాప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను. వ్రాతప్రతిలోవున్న మూడో నాటకం నీకు తెలుసున్నదేకదా! అయితే వీటిని అచ్చొత్తించే మార్గం అక్కడ వుందయ్యా వున్న చిక్కల్లాను !

అన్ని విధాలా నీ యోగ క్షేమాలను కాంకిస్తున్నాను,

ఎక్కహిల్ హౌస్
ఉదకమండలం
2 జూన్ 1909

ప్రియమైన ముని సుబ్రహ్మణ్యం.

నీ ఉత్తరం నాకెంతో ప్రీతిని కలిగించింది. నిన్ను నేనెన్నడూ అపార్థం చేసుకోలేదు. 'కన్యాశుల్కం నాటకంలో వేశ్య కనిపించే రంగాలు చెప్పకోతగ్గంత గొప్ప నీతిస్ఫోరకమైనవి కావని నువ్వు వ్రాసిన వాక్యాలను మాత్రమే నేను విమర్శిం చాను. ఇలాగ విమర్శిస్తున్నపుడు మన భావనాత్మక సాహిత్యం లోని నైతికధర్మాలను పర్యావలోకించాను.

నైతిక జ్ఞానమన్నది గుణస్వభాలనుబట్టి కొంతవరకూ తప్పక ఏర్పడుతున్న మాట నిజం. అయినా కేవలం వీటిపైననే


మఱి, వాడెక్కడరా మీతలమానిసి వేగంటి పిపాసి ?... ఊ.ఓరీ. ఆదిత్యా నీవేలరా కట్టియ లెండింపవు ?... మఱి, వాఁడెక్కడ నీ సైదోడు ?.... (స్మితముతో) జడాత్ముడు, వానికేదియు ముందుగాఁ దోపదు. (వీక్షించి) ఊ, ఓరీ, అగ్న్యాదిత్యులారా, మా తపస్సును చెప్పడు. మీరే గదా సాక్షులరు...." ఇత్యాదులు.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/91&oldid=153040" నుండి వెలికితీశారు