పుట:Leakalu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెప్పకుని గర్వపడేందుకు యెంతమాత్రం తగనివిధంగా సృష్టించారు. దిక్పాలకుల్ని బాణాసురుడు "ఒరే!" అని సంబోధిస్తాడు.•


బంభరిక: వొశే కీరవాణీ! నీపని రవ్వంత ముంగట అయిందని యేం బడాయే నీకు!.....మునుపంతా యెప్పడో యిక్కడికి వచ్చే కొమారమహారాజు యిప్పడు రోజల్లా వొంటరిగా యీ తోట్లోనే తిరుగుతూ వుంటాడే అదేమిటి ?

కీరవాణి : ప్రెబువుల చిత్తానికి కారణం యెందుకే ?

బంభ : మరి, జక్కవపిట్టలని జతలకట్టి వాటిమీద యేమిటేమిటో చిత్రాలు రాస్తాడే అదెందుకే ?

కీర : నువ్వొక గోడవే ? వీటికోసమే. (అని బంభరిక పాలిండ్లం బొడుచును.)

బంభ : నువ్వెక్కణ్ణి మడకనిపడ్డావే (మడకనిబడ్డావే = పురుషుని పొందితివనిభావం.)

కీర : రాయే లంజా, నువ్వుకూడా పడుదువుగాని.

బంభ : యింకొకటిమాత్రం చెప్ప. ఆ వాకలోకి దిగి ఆయనెందుకే ఆసుళ్ళని వెతికి వెతికి ముద్దెట్టుకొంటాడు

కీర : చాల్లే యీపాటికి నువ్వెవయినా వొకరంగణ్ణి తగులుకొని రాత్రి వాణ్ణడుగు చెప్తాడు. నీకేమి చీకటి బయంలేదపే ? (అని నిష్క్రమింతురు)

' ప్రథమాంకము : బాణుడు కుంభాండుడు. రాణి, ఆహాదనుడు ఉషాదులు కూర్చునివుండగా బాణుడు తనతపస్సును వర్తించి క్పాలకు లను చెప్పమంటూ “ఓరి అగ్నీ, ఈ కుంభాండాదులు వీన మాతపస్సును వర్ణింపుము. (నిర్వర్ణించి) ఏమిరా, నీవిట్లు బొగ్గువలె నలఁబడినాఁడవు?....ఏమిరా వాయూ, నీవేల ప్రొయ్యి యూదకుంటివే (అని వాయువును కొట్టనుంకించుచున్నాడు). మంచిది; చక్కగా వీవుము.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/90&oldid=153039" నుండి వెలికితీశారు