పుట:Leakalu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అది ఏర్పడుతున్నదని నేనెన్నడూ చెప్పలేదు. నైతిక భావాలను గురించిన ఆ షేపణ వ్యక్తుల గుణస్వభావాలనుబట్టి కొంతవరకు కలుగుతున్నదని మాత్రమే నీకు నేను వ్రాసిన విషయం. అలాగ వ్రాస్తున్నపుడు సాహిత్యసిద్ధాంతాలను, తీరులను, తీర్పులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తావించాను. నేను వున్న యదార్థమిదీ అని పేర్కొన్నాను. సాహిత్యవిమర్శనచరిత్రను పరిశీలిస్తే నేను చెప్పినది నిజమేనని ధృవపరుస్తుంది. ఆధ్యాత్మిక నీతిశాస్త్రాలను నువ్వొకసారి పరికించినట్లయితే యిక మనకీవివాదమే వుండదు.

స్త్రీ పురుష లైంగిక సంబంధాలను వేటికవి ప్రత్యేకించి విశ్లేషించి సమగ్రంగా పరీక్షించాలని నా అభిమతం. లేబరేటరీల నుంచి కన్వెన్షన్ల రంగుదీపాలను తొలగించి స్త్రీపురుష శారీరక సంబంధాలను చాలా సూక్ష్మాతిసూక్ష్మంగా దేనికది విభజించాలని నా కోరిక, శారీరక శాస్త్రసూత్రాలతో చారిత్రక దృష్టితో వీటిని పరిశీలించు; పరీక్షించు. అపుడు వాటికిగల నిజమైన మూల్యమెంతో నిర్ణయించడం అలవరుచుకో.

జీవితంలో నువ్వు సత్యాన్ని పేమిస్తున్నావుకదా. సత్య మనే దానిని ఆరాధిస్తున్నావుకదా; మరి సెంటిమెంటులోవున్న సత్యమును ఎందుచేత అన్వేషించవు ? అనుస్యూతంగా మనస్సు నంటి పెట్టుకున్న భావాలలోని సత్యమును ఎందుకని గ్రహించవు ? మగవాళ్ళ అధికారం కింద పెత్తనం కింద బానిసలుగా ఆడవాళ్లుఎలాపడివుంటున్నారో ఎంత వ్రుగ్గిపోతున్నారో నే నూ హించుకోగలను. నువ్వామాత్రం ఊహించుకోలేవా? ఊహించి చూడు. నీచుట కనిపిస్తున్న వైవాహిక జీవితాన్ని పరిశీలించు; అవగాహన చేసుకో,

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/92&oldid=153041" నుండి వెలికితీశారు