పుట:Leakalu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సానిపిల్లలో వుండే మానవత్వాన్ని నువ్వు మరిచిపోకు. ఆమె సైతం వొక మానవవ్యక్తి అనే మాటను విస్మరించకు. ఆమె విచారం కన్నీళ్లూ సంతోషం ఆనంద బాష్పాలూ నీ నా సుఖదుఃఖాల వంటివే ! మన అనుభూతులకు వలె అవీ గణు తింప తగినవే. గంభీరమైనవే !

అవినీతిపరురాలైన వొక భార్యా లేక వ్యభిచారి అయిన వొక భర్తా కాదా వీరిద్దరితోనూ కూడిన సమాజమూ పరీత్యా వొక సానిపిల్లకంటె మిన్న వ్యభిచారమే తనవృత్తిగా లేబిల్ వేయబడ్డ భోగంపడుచు సమాజాన్ని మోసగించడం లేదు. ఆమెకువున్న లేబిల్ దృష్ట్యా ఆమె జీవితం సరియైనతోవనే సాగు తున్నది. ఆమె యే వివాహబంధనాలను వైవాహిక సూత్రా లనూ ఉల్లంఘించడం లేదు.

జపానులో గై షా అనే వొక తరగతి వేశ్యలను ఉన్నత ప్రభువులు, రాజవంశీకులు వివాహమాడతారు కదా, మరి దీనికి నువ్వేమంటావు? గ్రీకు దేశపు ఆస్పేషియాలనుగురించి నీకు శెలిసే వుంటుంది. లాండన్నొకసారి చదివిచూడు. చరిత్రలో గ్రీకు జపానులు ప్రసిద్ధికెక్కిన దేశాలని గణుతికెక్కాయి.

ఉన్న అసలుసంగతి యిదీ: సృష్ట్యాది వివిధపరిణామూలను తెలిపేది మానవశాస్త్రం. మానవపరిణామశాస్త్రాధ్యయనమూ శాస్త్రవిమర్శనశక్తి ఎక్కువవుతున్న కొలదీ, ఈజ్ఞానం వొక పరమసత్యాన్ని నొక్కినొక్కి చెబుతున్నది. ఇప్పడున్న సాంఘిక భావాలు పోయి వాటిస్థానే కొత్తవి రావలసిన అవసరానికీ అగ త్యానికీ, మానవపరిణామ వాదం దారితీస్తున్నది కంటి ఎదుట స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవికవిషయాలకు భయపడి వాటిని

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/84&oldid=153034" నుండి వెలికితీశారు