పుట:Leakalu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మరుగుపుచ్చి తప్పించుకు తిరగడంవల్ల ప్రయోజనం లేదు. స్త్రీ పురుష లైంగిక సంబంధాలకు అనవసర ప్రాముఖ్య మివ్వడంలో అర్థమేముంది; ఔచిత్య మేముంది ?

సామాజికపరిణామచరిత్రలో వివాహసంస్థకున్న ప్రాధా న్యాన్ని నేను తక్కువ చేస్తున్నాననుకోకు. మానవజాతి గడ చిన రెండుళతాబ్దాలలోను అమోఘమైనవిజ్ఞానాన్ని పొంది పురోగమించింది. గొప్ప గొప్ప ఆలోచనాపరులు ధీశాలురు పాతకాలపు అభిప్రాయాలను, ఆదర్శాలను పరీకు చేయడాని కుపక్రమించారు. వివాహసంస్థ పురోగతికి దోహదం చేసినదన్న మూట నిజమే; అయితే వివాహబంధాన్ని తెంచుకోరాదనే నియమం చెప్పనలవి కాని కన్నీటిగాథలకు కారణం. ఈసత్యాన్ని మనమెవరమూ విస్మరింపలేము. ఈ కథ యింతటితో ముగియడం లేదు.

ఇంగ్లీషు వారికి వివాహం వొక సివిల్ కాంట్రాక్టువంటిది. పెల్లీ, జార్షియిలియటులు జుగుప్సతో వివాహమనే భావాన్ని త్రోసిపుచ్చి అవతలకు ఎగురకొట్టివేశారు. ఆధునిక మహిళలు మానవచరిత్రను తిరిగి రచిస్తారు.

నేను ఉదాత్త శృంగారకల్పనలలో శృంగారకథావస్తువు అదృశ్యమౌతున్నది. బానికి ప్రాముఖ్యము తగ్గిపోతున్నది. లేదా అది ద్వితీయస్థానాన్ని మాత్రమే పొందగలుగుతున్నది. స్త్రీపురుషశారీరకవాంఛలనుగురించి కామప్రవృత్తినిగురించి కావ్యఇతివృత్తాలలో మార్పుక పిస్తున్నప్పటికీ సాహిత్యం కేవలం వీటితోనే ఎందుకు నిండివుండాలి? స్త్రీపురుష శారీరకవాంఛలు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/85&oldid=193006" నుండి వెలికితీశారు