పుట:Leakalu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్తరమైన బాధ్యత వుంది. కనుక పాఠకులు నన్నొక ప్రశ్న అడగవచ్చును. నేను వొకదోషాన్ని దుర్నడతను ఆకర్షవంతం చేళానా ? చేయలేదనే భావిస్తున్నాను. కన్యాశుల్కం మొదటి కూర్పులో మధురవాణి వర్ణింపరాని హేయమైన నడవడిక గలది; ఆ పాత్రకు ఎట్టి వన్నెచిన్నెలూ లేవు. నాటకం రచిస్తున్న కొద్దీ మధురవాణి పాత్రమీద నాకున్న దృక్పథం మారుతూ వచ్చిcది. అందువల్ల, పరస్పర విరుద్ధ లకణాలు వాటంతటవి వచ్చి పడినవే మే నాకు తెలియదు.

అయితే మానవ స్వభావంలోనే పరస్పరవైరుధ్యం వున్నది కనుక దీనిని గణుతింప నక్కరలేదు. మధురవాణిపాత్ర అంటే నాకు నేనే ముచ్చట పడుతున్నాను, కనుక ఆమెను చివరి అంకంలో సంస్కరించాను, ఇంక నీతో నాకువివాదగ్రస్త విషయమేమీ లేదు.

కన్యాశుల్కం నాటకం పిలవని పేరంటానికి 'మాఅప్ప పట్టుచీరె కట్టుకొస్తానని బయలుదేరి యేదో వొక నైతికోద్దే శాన్ని ప్రత్యకంగా బలవంతంగా నెత్తిన రుద్దదు. కాని దానికి ఒక మహత్తరమైన నైతిక ప్రయోజనం వుంది.

మానవ జీవితంతో నేను చెలగాటం ఆడడం లేనేలేదు" ఈ సంగతి నా నాటకం చదివితే నీకు తెలుస్తుంది. ఎట్టి తృణీకారభావమూ లేకుండా, మానవజీవితాన్ని గంభీరమైన దానినిగా భౌపెంచి యీ నాటకంలో దానిని యితివృత్తంగా స్వీకరిం చాను. ఆద్యంతం నవ్వు తొణికిసలాడేటట్ట యింత గంభీర యితి వృత్తాన్ని నిర్వహించడం అంత తేలికైన పనికాదు.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/83&oldid=153033" నుండి వెలికితీశారు