పుట:Leakalu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చాలా ఆనందించాను. మీనాన్నగారికి నాప్రణామాలను తెలియ చేయవలసినదిగా కోరుతున్నాను.

నా నాటకం నీకు నచ్చినందుకు సంతోషం. నీ అభిప్రాయానికి నేను విలవయిస్తాను. నువ్వుపంపిన 'ఫారాలను' చదివాను*. మళ్లీ మళ్లీ చదవాలని మనసు పుట్టింది. చదవతగ్గ కావ్యానికి నిజమైన పరీక. విస్మయ కారణాలయిన లక్షణా లను చూసి యే రచయితా ముగ్ధుడుకాడు. రచయుత ఒక పుస్తకం నిజంగా బాగుందీ అంశేు అది అక్షరాలా సొగసుగా వుందని, దానర్థం. కన్యాశుల్కం నాటకంలో నిజమే మీనాక్షి కనిపించే దృశ్యాలు అంత నీతిదాయకమైనవీ ఉపదేశక మైనవీ కావు. అయితే వొకమాట మాటవరసకి షేక్స్పియరు నాటకాలలోంచి నీకు కొన్ని దృష్టాంతాలను చూపిస్తాను, నాలుగ హెన్రీ అయిదవ హెన్రీ మెర్రీవైన్స్ అనే నాటకా లలో తటస్థపడే డాల్ పీర్ పీట్ మైన్ హాస్టెన్ డేమ్క్విక్లీ మొద లైనపాత్రలు - సర్ జాన్ ఫాల్స్టాఫ్ తో వొక కూటమిగా యేర్పడి యెంతో ఆసక్తిని కలిగిస్తాయి. ఈ పాత్రలలో యేదీ


  • కన్యాశుల్కము ఫారాలు: “నేను నెల్లారులో ఉపాధ్యాయుడుగ నుండుకాలములో అనగా 1909 వ సంవత్సరములో ప్రూపునాకంపబడి యుండెను. నేను జూచి పంపియుంటిని"

' కొన్ని సందర్భములలో పంతులవారికిని నాకును భేదాభిప్రాయ ములు గలిగి ఉత్తరప్రత్యుత్తరములద్వారా చర్చ జరిగియుండెను. మీనాక్షీయను బాల్యవితంతువును మధురవాణియను వేశ్యయు గనపడు నాటకరంగములు ఔచిత్యవ్యతిరేకములనియు నైతిక విరుద్ద ప్రయోజన కారులనియు ఆ ప్రదర్శనములు యువతీ యువకులకు శ్రేయోదాయక ములు గావనియు విమర్శించియుంటిని." -శ్రీ సుబ్రహ్మణ్యంగారు.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/81&oldid=153030" నుండి వెలికితీశారు